Site icon Prime9

Prathipati Pulla Rao : విడదల రజిని పై మండిపడుతున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

tdp prime9news

tdp prime9news

Prathipati Pulla Rao : మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.టీడీపీ హయాంలో కొంతమంది సన్నిహితంగా ఉండి నిలువునా దోచుకున్నారని,వెనుక నుంచి వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయారని.. ఇప్పుడు వారు వైఎస్సార్‌సీపీ పార్టీలో రకరకాలుగా చర్చించుకుంటున్నారన్నారు.గతంలో వారు మాట్లాడినా మాటలు…అబద్ధాలు, అవాస్తవాలను,వారి మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే చె అధికారంలోకి వచ్చారని..రాజకీయాల్లో ఉన్నామంటే ఉన్నాం అని కాకుండా,గౌరవప్రదంగా ఉండాలని..ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు జరిగిన దాన్ని మరిచిపోరని..మంత్రి విడదల రజినికి పరోక్షంగా విమర్శలు చేశారు.

అసలైన వెన్నుపోటు దారులెవరో నియోజకవర్గ ప్రజలే చర్చించుకొంటున్నారని..ప్రజలని అడిగితే నిజాలు తెలుస్తాయని అన్నారు.నమ్మకంగా నాలుగున్నర సంవత్సరాలు నా దగ్గరే ఉన్న ఇక్కడి మంత్రి పదవులు అనుభవించారని,దిరికినంత దోచుకొని, తెలుగుదేశం పార్టీ నేతలతో సన్నిహిత సంభంధాలు పెట్టుకొని మరి వెన్నుపోటు పొడిచారని విమర్శలు చేశారు.

ఇటీవల జరిగిన ఉమ్మడి గుంటూరు జిల్లా నియోజకవర్గ ఇంఛార్జ్‌లతో సమావేశ కార్యక్రమంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పైన చెప్పిన విధంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి నియోజకవర్గంలో మా టీడీపీ నాయకులు ఎక్కడికక్కడ బలంగా పనిచేస్తున్నారని.. కానీ వారి వీడియోలు మాత్రం రావడం లేదని..అవి అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా రావడం లేదని, పార్టీ కోసమే పని చేసే వాళ్ళకు టీడీపీలో స్థానం లేకుండా చేస్తున్నారని అన్నారు.

Exit mobile version