PM Modi Telangana Tour : తెలంగాణలో మోదీ పర్యటన ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్రంలో మోదీ పర్యటన తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 13న మోదీ హైదరాబాద్ రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చేపట్టిన ఆధునీకరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఐఐటీ హైదరాబాద్ లో నిర్మించిన నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు. వీటితోపాటుగా మూడు జాతీయ రహదారుల విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
వాస్తవానికి జనవరి 19న మోదీ హైదరాబాద్ కు రావాల్సి ఉండగా.. అది వాయిదా పడింది. మోదీ వందే భారత్ రైలును హైదరాబాద్ లో ప్రారంభించాల్సి ఉండగా.. దిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. మిగిలిన కార్యక్రమాల షెడ్యూల్ ను వాయిదా వేశారు. హైదరాబాద్ లో వివిధ కార్యక్రమాలు అనంతరం.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే బహిరంగ సభలో మోదీ మాట్లాడనున్నారు.
ఐఐటీ హైదరాబాద్ (IIT Hyderabad) భవనాన్ని భారీ హంగులతో నిర్మించారు.
దీనిని ప్రధాని ప్రారంభించిన అనంతరం.. జాతికి అంకితం చేయనున్నారు.
సికింద్రాబాద్-మహబూబ్ నగర్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
రూ.699 కోట్లతో చేపట్టనున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన.
కాజీపేటలో రైల్వే ప్రీడియాటిక్ ఓవరాలింగ్ పనులకు శంకుస్థాపన.
మహబూబ్ నగర్, నిజాంపేట, నారాయణ్ ఖేడ్, బీదర్ జంక్షన్లను శంకుస్థాపన.
ఒకవైపు పూర్తైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నా మోదీ.
రూ.3 వేల కోట్లకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాలకు మోదీ హాజరు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ భారీ బహిరంగ సభ
అధికారిక పర్యటన కావడంతో తక్కువ మందితో సభ నిర్వహణ.
ఈసారి భిన్నంగా సభ నిర్వహించాలని భాజపా నేతల ప్లాన్.
మోదీకి ఘనంగా స్వాగతం పలికేందుకు భాజపా నేతల ఏర్పాట్లు.
మోదీ రాకతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై భాజపా విమర్శలు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/