Site icon Prime9

Minister Roja: పవన్ వాహనం వారాహి కాదు నారాహి.. మంత్రి రోజా

Minister Roja

Minister Roja

Minister Roja: ఏపీ మంత్రి రోజా పవన్ వాహనం వారాహి కాదు అది నారాహి అని రోజా ఎద్దేవా చేశారు. కత్తులతో పవన్ ఎవరిపై యుద్ధం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడని, ఎవరి సైన్యంలోనో దూరి యుద్ధం చేయాలని పవన్ చూస్తున్నట్లు ఉందని, వారాహి రంగుపై పవన్ కళ్యాణ్ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని, 175 స్థానాల్లో అభ్యర్థులను పెట్టుకొలేని పార్టీ జనసేన పార్టీనే అని ఆమె విమర్శించారు..

పవన్ వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించాల్సిన పని లేదని, మీడియా అనవసరంగా పవన్ కు ప్రాధాన్యత ఇస్తోందని రోజా అన్నారు. హైదరాబాద్ లో నివసించే పవన్, శ్వాస తీసుకోవాలా వద్దా అనేది చెప్పాల్సింది తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్ అని, టీడీపీ అధినేత చంద్రబాబు కోసం దత్త పుత్రుడు పని చేస్తున్నాడని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాలు గెలిచి పవన్, చంద్రబాబులను హైదరాబాద్ కు సీఎం జగన్ పంపడం ఖాయంమన్నారు. పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అని, పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర ప్రజలపైనా పార్టీ పైనా ప్రేమ లేదని మంత్రి రోజా విమర్శించారు. మరోవైపు పవన్ చేసిన ట్వీట్‌కు మంత్రి అంబటి రాంబాబు కౌంటరిచ్చారు. శ్వాస తీసుకో.. ప్యాకేజ్ వద్దు అంటూ ట్వీట్ చేశారు.

ఆర్మీ వాళ్లు మాత్రమే గ్రీన్ రంగు వాడాలన్న వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారు.. గ్రీన్ రంగు కార్లు, బైకులను తన వారాహి వాహనం ఫోటోతో కలిపి ట్వీట్ చేశారు పవన్. రూల్స్ ఒక్క పవన్ కల్యాణ్‌కేనా అంటూ ఆయన ప్రశ్నించారు. మరో ట్వీట్‌లో పచ్చని చెట్లను పోస్ట్ చేసిన పవన్.. ఈ గ్రీన్‌లో వైసీపీకి ఏ గ్రీన్ అంటే ఇష్టమో చెప్పాలని నిలదీశారు. ఇక 80వ దశకంలో బాగా పాపులర్ అయిన ఒనిడా టీవీ ప్రకటనను కూడా పవన్ ట్వీట్ చేశారు. మన గర్వం పక్కవాడికి కడుపు మంట అంటూ ఆ యాడ్‌ను పోస్ట్ చేశారు పవన్.
తాను ఊపిరి తీసుకోవడం ఆపేయ్యాలా అంటూ ప్రశ్నించారు.

Exit mobile version