Site icon Prime9

Pawan Kalyan: నా రంగు వల్ల నేను వివక్షకు గురయ్యా.. నాకు మంచినీళ్లు కూడా ఇవ్వలేదు- పవన్ కళ్యాణ్

pawan-kalyan-fire-on-ap-govt in twitter

pawan-kalyan-fire-on-ap-govt in twitter

Pawan Kalyan: ఎస్సీ- ఎస్టీ సబ్ ప్లాన్ పై వైసీపీ తీరును నిరసిస్తూ జనసేన రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తుంది. ఈ సదస్సులో మాట్లాడిన పనవ్ కళ్యాణ్ తన అనుభవాలను పంచుకున్నారు.

ఒకనోక సందర్భంలో తాను వివక్షకు గురైనట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. మనం వివక్షకు గురైనపుడే.. వివక్షకు గురైన మరో వ్యక్తి బాధ తెలుస్తుందని మంగళగిరిలో జరిగిన సదస్సులో ఆయన తెలిపారు.

సమాజంలో ప్రతి రోజు వ్యక్తి ఏదో రకంగా వివక్షకు గురవుతునే ఉన్నాడని పవన్ అన్నారు.

విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ వివిక్షకు పవన్ గురైనట్లు తెలిపారు.

విమానంలో ప్రయాణిస్తున్నపుడు నీళ్లు ఇవ్వడానికి కూడా సంకోచించారని.. పవన్ తన అనుభవాన్ని పంచుకున్నారు.

దీనిపై అప్పుడే ప్రశ్నించానని.. ప్రశ్నించినప్పుడే వివక్షను దూరం చేయగలమని వివరించారు.

ఓసారి వివక్షకు గురైతే అది ఎలాంటి బాధ కలిగిస్తోందో పవన్ చెప్పారు.

ముఖానికి ఉన్న రంగును బట్టి వివక్ష చూపే రోజులు ఇంకా ఉన్నాయన్నారు.

రంగు వేరైనా మాత్రానా తాము భారతీయులమని.. రంగును బట్టి వివక్ష చూపడం మానుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో కులవివక్ష ఎక్కువ ఉందని.. దానికి కారణం జగన్ ప్రభుత్వమే అని ధ్వజమెత్తారు.

వివక్షకు గురయ్యే కులాలను అర్ధం చేసుకోవాలని.. ఒకరిద్దరు చేసిన తప్పులకు కులాలను తప్పుపట్టడం మంచిది కాదని పవన్ (Pawan Kalyan) అన్నారు.

ఒక్కరు చేసిన తప్పుకు కూలాలను సాకు చూపకూడదని.. ఆ సామాజిక వర్గంలో అందరు అలాంటి వాళ్లు కాదని పవన్ తెలిపారు.

కులాల వివక్ష పోయినపుడే రాష్ట్రం అభివృద్ధి బాటలో సాగుతుందని అన్నారు.

బడుగు బలహీన వర్గాల్లో ఐక్యత రావాలని పవన్ Pawan Kalyan పిలుపునిచ్చారు. ఐక్యత సాధించినపుడే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని పవన్ అన్నారు.

రాష్ట్రంలో కులాలను వేరు చేసే వైసీపీ పాలనను తరిమికొట్టాలని ఈ సందర్భంగా పవన్ పిలుపునిచ్చారు.

తాము అధికారంలోకి వస్తే కుల వివక్షతకు తావు లేకుండా చేస్తామని తెలిపారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version