Site icon Prime9

Gudivada Amarnath: బాలయ్య బాబు కాదు తాత- గుడివాడ అమర్నాథ్ ఘాటు విమర్శలు

Gudivada Amarnath comments on balakrishna

Gudivada Amarnath comments on balakrishna

Gudivada Amarnath: విశాఖలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మంత్రి గుడివాడ అమర్నాధ్ మాట్లాడుతూ, విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా బాలయ్య బాబు కాదు తాత అని అన్నారు. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి అడ్డంకులు సృష్టించిన వ్యవహారం గురించి ఒక విలేఖరి బాలయ్య బాబు అని అనగా దానికి ఆయన వెంటనే బాబు కాదు తాత అంటూ బదులిచ్చారు.

బాబు కాదు తాత..

60 సంవత్సరాలు ఉన్న బాలయ్య.. బాబు ఎలా అవుతాడు అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు, బాలయ్య బాబు ఇద్దరు బాబులు కలిసి మీటింగులు జనాలు తిరిగే చోట పెడితే మార్కెట్ కి వెళ్లే వాళ్ళో, ఆ దారిలో పోయేవారో వస్తే అది మా క్రేజ్ అని చూపించుకోడానికే ప్రయత్నిస్తున్నారు.. తప్పా వారిని జనం చూసే పరిస్థితి లేదన్నారు. రాజకీయ సభ అయినా, సినిమా సభ అయినా నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే పర్మిషన్ ఇవ్వడం వీలు పడుతుందని అన్నారు.

రోజా మెగా కుటుంబం.. అమర్నాథ్ నందమూరి కుటుంబం

నిన్నగాక మొన్న రోజా, మెగా కుటుంబంపై చేసిన విమర్శలకు కౌంటర్‌గా మెగా అభిమానులు #KuppaThottiRoja అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పుడు మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) కూడా నందమూరి కుటుంబాన్ని టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. ఇక, దీనిపై నందమూరి ఫాన్స్ ఎలా ఫైర్ అవుతారో చూడాలి.

ఇకపోతే తాజాగా వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో అంగరంగవైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి: 

Mekapati Chandrasekhar Reddy: నాకు ఇద్దరు పెళ్లాలు ఉన్నారు.. మూడో పెళ్లాం లేదు

Nadendla Manohar: మంత్రి అప్పలరాజుకు జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఓపెన్ ఛాలెంజ్.. ఏంటంటే..?

Minister Roja : అప్పుడు లేవని నోరు ఇప్పుడు ఎందుకు లేస్తుంది అంటూ నాగబాబుకి బదులిచ్చిన ఇచ్చిన మంత్రి రోజా

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version