Site icon Prime9

Minister KTR: ఢిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములు.. మంత్రి కేటీఆర్

Hyderabad: ఢిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములను, ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని తెలంగాణ గమనిస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదివారం సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం నుంచి బయటకు వచ్చిన కేంద్ర హోం మంత్రికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదరక్షలు అందించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. దీనిపై మంత్రి కేటీఆర్‌ ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు.

ఢిల్లీ “చెప్పులు” మోసే గుజరాతీ గులాములను ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని తెలంగాణ రాష్ట్రం గమనిస్తున్నది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి గొట్టి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్దంగా ఉన్నది అంటూ కేటీఆర్ ట్వీట్ చేసారు.

మరోవైపు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కూడ ఈ వీడియోపై స్పందించారు. బానిస రాజకీయాలకు బీజేపీ తెరలేపింది. బండి సంజయ్‌, అమిత్‌ షా చెప్పులు మోశారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మోదీ, షా కాళ్ల వద్ద తాకట్టు పెట్టారంటూ విమర్శలు గుప్పించారు.

Exit mobile version