Site icon Prime9

మంగళగిరి: పెరుగుతున్న పవన్ కళ్యాణ్ సేన… కోనసీన జిల్లా నుంచి వైసీపీ నేతల చేరిక

YSRCP leaders who joined Janasena party under Pawan Kalyan

YSRCP leaders who joined Janasena party under Pawan Kalyan

Mangalagiri: జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు సినిమాలు ఇటు రాజకీయాలతో బిజిబిజీగా కాలం గడిపేస్తున్నారు. ప్రజాసేవే పరమావధిగా ఆయన తన సమయంలో ఎక్కువ భాగం ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. తాను సినిమాల ద్వారా సంపాదించిన డబ్బునంతా ప్రజల సమస్యలను తీర్చేందుకు ఖర్చుపెడుతూ తనదైన మానవత్వాన్ని చాటుతూ నిఖార్సైన రాజకీయనేతగా ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇవ్వాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు.

పవన్ పర్యటనతో పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. వైసీపీ నుంచి పలువురు కార్యకర్తలు ఆ పార్టీని వీడి బయటకు వచ్చేస్తోన్నారు. పలువురు ఉత్సాహవంతులు, యువ కార్యకర్తలు పవన్‌తో కలిసి నడిచేందుకు సిద్ధమయ్యారు. పి.గన్నవరం, రాజోలు నుంచి వైసీపీ కార్యకర్తలు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

పవన్ కళ్యాణ్ సిద్దాంతాలు ఆయన అభిమతం నచ్చి ఆయనతో కలిసి ప్రజలకు సేవ చేసేందుకు మేముంటామంటూ భారీగా ప్రజలు తరలివస్తున్నారు. భవిష్యత్తులోనూ మరికొంత మంది పార్టీలోకి చేరే అవకాశాలున్నాయని ఈ మేరకు జనసైనికులు కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేసేందుకు స్వచ్ఛందంగా అనేక మంది ముందుకు వచ్చారు.

ఇదిలా ఉంటే ఈ రోజు వైసీపీ మంత్రి అంబటి రాంబాబు అడ్డాలో పవన్ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ మేరకు జనసైనికులు మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి సత్తెనపల్లి వరకు భారీగా కట్ ఔట్లు, హోర్డింగులు పెట్టి పవన్ కు ఘన స్వాగతం పలుకుతున్నారు.

ఇదీ చదవండి: సత్తెనపల్లి: అంబటి అడ్డాలో పవన్ కౌలురైతు భరోసా యాత్రకు భారీ ఎత్తున ఏర్పాట్లు

 

 

Exit mobile version