Andhra Pradesh: రాష్ట్రంలోని 13మంది వైసీపీ ప్రజా ప్రతినిధులపై జనసేన పార్టీ శ్రేణులు దాడులు చేసే అవకాశం ఉందంటూ పోలీసు ఇంటిలిజెన్స్ నివేదికపై అధికార పార్టీ కుట్రలు తిప్పి కొట్టాలని జనసేన పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు జనసేన నేత నాదెండ్ల మనోహర్ అప్రమత్తం చేశారు.
ప్రజాప్రతినిధులపై దాడులు చేస్తారంటూ మీడియాకు ఉప్పందించిన వార్తలు నిజమైతే వెంటనే డీజీపి చర్యలు తీసుకోవాలని నాదెండ్ల డిమాండ్ చేశారు. అత్యంత రహస్యంగా ఉండాల్సిన ఇంటిలిజెన్స్ ఉత్తర్వులు ఎలా మీడియాకు వెళ్లాయో దర్యాప్తు చేయాలన్నారు. రోజు రోజుకీ జనసేన పార్టీకి పెరుగుతున్న జనాధరణ చూసి అసూయ చెందుతున్న అధికార పార్టీ నేతలు ఇలాంటి కుట్రలకు తెరలేపుతున్నారని ఆయన మండిపడ్డారు.
రెచ్చగొట్టే చర్యలు వైజాగ్ లోనే చేపట్టారని, అయితే అధికార పార్టీకి అవకాశం రాలేదన్నారు. అక్కడ కుదరకపోవడంతో తాజాగా కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. ప్రజల్లో అపోహలు సృష్టించి గొడవులు పెట్టించి కారణం జనసేన పార్టీ అంటూ రుద్ధే ప్రయత్నంలో ఇంటిలిజెన్స్ రిపోర్టు నాటకంగా చెప్పుకొచ్చారు. ప్రజా క్షేత్రంలోనే తేల్చుకొంటామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. క్రమశిక్షణ, శాంతియుత ప్రవర్తనతో జనసేన సైనికులు ముందుకు వెళ్లతారన్నారు. వైసీపి కుట్రలు నమ్మే పరిస్ధితిలో ఎవ్వరూ లేరన్నారు.
ఇది కూడా చదవండి: Janasena Party: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఏపీలోని మహిళా కమీషన్