Site icon Prime9

YS Sharmila : షర్మిలకు ప్రధాని మోదీ ఫోన్… ఆ విషయం గురించి ఆరా !

interesting details about pm modi phone call to ys sharmila

interesting details about pm modi phone call to ys sharmila

Andhra Pradesh News: ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిలకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసినట్లు సమాచారం అందుతుంది. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్టీపీ పార్టీని స్థాపించి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు వైఎస్ షర్మిల. కాగా ఇటీవల షర్మిలను అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అంతకుముందు రోజు ఆమె పాదయాత్రను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో దీనికి నిరసనగా మరుసటి రోజు ప్రగతి భవన్ వద్ద దీక్ష చేపట్టేందుకు షర్మిల కారులో బయల్దేరి వెళ్లారు.

ఈ క్రమం లోనే ఆమె కారును పోలీసులు అడ్డుకున్నారు. క్రేన్ ద్వారా కారుతోసహా షర్మిలను అదుపులోకి తీసుకెళ్లారు. ఆమెను ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో ఉంచి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తర్వాత నాంపల్లి కోర్టులో హాజరపర్చగా, కోర్టు షర్మిలకు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ఈ విషయం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఆమెకు ఫోన్ చేసి సానుభూతి తెలిపినట్లు అనుకుంటున్నారు.

కాగా షర్మిలతో అరెస్టు వ్యవహారం గురించి దాదాపు పది నిమిషాల పాటు మోదీ మాట్లాడినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నట్లు షర్మిల సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తుంది. ఈ విషయంలో టీఆర్ఎస్, షర్మిల మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతోంది. మరి ఈ తరుణంలో మోదీ, షర్మిలకు ఫోన్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version