Site icon Prime9

Ganta Srinivasarao : పార్టీ మార్పుపై మాజీ మంత్రి గంటా క్లారిటీ..!

ganta-srinivasarao-gives-clarity-about-future-politics

ganta-srinivasarao-gives-clarity-about-future-politics

Andhra Pradesh: తెదేపా నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ ఫిరాయింపులపై క్లారిటీ ఇచ్చారు. గత కొంతకాలంగా ఆయన వైకాపా గూటికి చేరతారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఈ విషయాల గురించి నోరువిప్పని గంటా… తాజాగా తన మనసులో మాటని బయటపెట్టారు. ఇటీవల ఒక సమావేశంలో పాల్గొన్న గంటా తన భవిష్యత్తు రాజకీయాల గురించి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేపధ్యంలో పార్టీ అధిష్టానంతో సంబంధం లేకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అందరికీ షాక్ ఇచ్చారు గంటా శ్రీనివాసరావు. ఆ తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం లేదంటూ స్వంత పార్టీ నేతలే ఆయనపై విమర్శలు చేశారు. కాగా గత కొంతకాలం నుంచి పార్టీ కార్యక్రమాల్లో మళ్ళీ యాక్టివ్ అయ్యి పార్టీ నేతలతో మమేకం అవుతున్నారు గంటా. అయినప్పటికీ ఆయన పార్టీని వీడతారంటూ వార్తలు పుట్టుకోస్తూనే ఉన్నాయి. ఈ తరుణం లోనే ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోలో గంటా మాట్లాడుతూ… తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు చంద్రబాబు గారి తోనే ప్రయాణం అంటూ తేల్చి చెప్పారు. అలానే తెలుగుదేశం పార్టీ లోనే ఉంటా… తెలుగుదేశం పార్టీ విజయం కోసం పని చేస్తా అన్నారు. సోషల్ మీడియాలో ఏవేవో రాస్తుంటారని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. గంటా శ్రీనివాసరావు ఒకసారి ఎంపీగా, 4 సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా పని చేశారు.

Exit mobile version