Site icon Prime9

Devineni Uma Maheswara Rao: కొడాలి నానిని ఓడిస్తాం.. తొడకొట్టి చెప్పిన దేవినేని ఉమామహేశ్వరరావు

Devineni-Uma-Maheswara-Rao

Vijayawada: గత కొద్దిరోజులుగా మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యల పై టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో విజయవాడలో జరిగిన సమావేశంలో కొడాలి నానిని ఓడించి తీరుతామని టీడీపీ నేతలు సవాల్ విసిరారు. సమావేశంలో మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఆవేశానికి లోనయ్యారు.

కొడాలి నాని, ఇతర వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ తొడ కొట్టారు. అంతేకాదు అక్కడే ఉన్న గుడివాడ టీడీపీ ఇంఛార్జ్ రావి వెంకటేశ్వరరావును పిలిపించి మరీ తొడ గొట్టించారు. దీంతో అక్కడున్న టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. రెండు రోజుల క్రితం దేవినేని ఉమ మహేశ్వరరావు, కొల్లు రవీంద్రలను గుడివాడకు వెళ్లకుండా పామర్రులోనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కారులలోనే డోర్ లాక్ చేసుకొని మూడు గంటలకు పైగా కూర్చొని నిరసనకు దిగారు మాజీ మంత్రులు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ లపై కొడాలి నాని తీవ్రపదజాలంతో విరుచుకుపడుతుంటారు. అందులో భాగంగానే కొద్దిరోజుల కిందట ఆయన చేసిన వ్యాఖ్యల పై రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి.

Exit mobile version