Site icon Prime9

Rahul Gandhi: తెరాసతో పొత్తు ఉండదు.. స్పష్టం చేసిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ

traffic-restrictions-in-hyderabad due to bharath jodo yatra

traffic-restrictions-in-hyderabad due to bharath jodo yatra

Hyderabad: 2023లో అసెంబ్లీ, 2024లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణాలో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని, తెరాస పార్టీతో పొత్తు ఉండదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. తెరాసాతో పొత్తు వద్దనేది టిపీసీసీ నాయకత్వం నిర్ణయమని, దాన్ని తాను స్వాగతిస్తున్నట్లు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తిమ్మాపూర్ లో ఆయన మాట్లాడుతూ భారత్ జోడో యాత్ర లో తనకు తెలిసిన అవగాహనా అంశాలను మీడియాతో పంచుకొన్నారు.

వచ్చే పార్లమెంటు ఎన్నికలు విభజన శక్తులు, సంఘటిత శక్తులకు మధ్య జరిగే పోరాటంగా ఉండబోతున్నాయన్నారు. కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో తెరాస పార్టీలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నాయన్నారు. మునుగోడు ఉప ఎన్నికలకు వందల కోట్లు ఖర్చు చేస్తున్న ఆ రెండు పార్టీలకు అంత డబ్బు ఎక్కడ నుండి వచ్చిందో చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. భాజపాపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. హిమాచల్, గుజరాత్ ఎన్నికల పోరాటం ఎలా ఉండబోతుందో పార్టీ అధ్యక్షులు ఖర్గే నిర్ణయం తీసుకొంటారన్నారు.

కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు తలపెట్టిన భారత్ జోడో యాత్రతో అనేక ప్రజల సమస్యలు తెలుసుకొనేందుకు వీలుపడిందన్నారు. చైతన్యం నింపుతున్నామని, యాత్రలో ప్రజల బాధలు తప్పక వింటానని రాహుల్ వ్యాఖ్యానించారు. మోదీ నాయకత్వంలో ప్రణాళికా బద్దంగా రాజ్యాంగ వ్యవస్ధలను నాశనం చేశారన్నారు. ఉద్యోగ కల్పన లేకుండా పాలన చేయడం వారికే తగిందన్నారు. తెరాస, భాజపాలు ఒక విధాన్ని అవలంభిస్తున్నాయని రాహుల్ ఖండించారు. విద్వేష రాజకీయాలు తిప్పకొట్టడమే తన అజెండా అన్నారు. కాంగ్రెస్ లో నియంతృత్వం ఉండదన్న రాహుల్ ప్రజాస్వామిక పార్టీగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో అధ్యక్షుడిని ఎన్నుకొనే సౌకర్యం ఒక్క కాంగ్రెస్ పార్టీలో ఉందన్నారు. ప్రతి పార్టీ అధినేతలు తమ పార్టీని గొప్పగా ఊహించుకొంటారని, తమకు తాము నేషనల్, గ్లోబల్ పార్టీలుగా చెప్పుకోవడంలో తప్పులేదన్నారు. Rahul Gandhi: భారత్ జోడో యాత్రను ఆపే శక్తి ఎవరికీ లేదు- రాహుల్ గాంధీ

కోవిడ్, ఇతరత్రా కారణాలతో భారత్ జోడో యాత్ర ఆలస్యంగా చేపట్టానన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడంతోపాటు వ్యక్తిగతంగా ఎన్నో నేర్చుకొన్నానని రాహుల్ సంతృప్తి వ్యక్తం చేశారు. యాత్ర ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నతికి దోహదపడుతుందని ఆయన అన్నారు. భారత జోడో యాత్ర క్రీడా యాత్ర కాదు, పొలిటికల్ యాత్రగా రాహుల్ పేర్కొన్నారు. రాజకీయపరమైన అంశాలను యాత్ర ముగిశాకే మాట్లాడుతానని, ప్రజలతో మమేకమవడానికి జోడో యాత్ర ఓ గొప్ప ముందడుగా రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

మొత్తం మీద రాహుల్ గాంధీ ఒక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. రాజకీయ అంశాలను యాత్రలో పేర్కొంటే భాజపా పార్టీ యాత్రకు బ్రేక్ వేసేందుకు ప్లాన్ చేస్తుందన్న కారణాలను దృష్టిలో ఉంచుకొన్న కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తుంది. దేశ వ్యాప్త సమస్యలు, రాజకీయ అంశాలను ఒక వేదికలో రాహుల్ కేంద్రం పై విరుచుకపడనున్నారు.

ఇది కూడా చదవండి: Munugode by poll: జూబ్లీహిల్స్ వద్ద రూ. 89.91లక్షలు పట్టివేత

Exit mobile version