Prime9

CM Jagan: ఈ భార్యతో కాకపోతే ఆ భార్యతో అంటూ.. పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ సెటైర్లు

CM Jagan: ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చాక ప్రతిపక్ష నేతలపై ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. నర్సీపట్నం వేదికగా పవన్ పై మరోసారి ఓ రేంజ్ లో విరచుకుపడ్డారు జగన్. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల ప్రస్తావన మళ్లీ తెరపైకి తెస్తూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

ఈ రాష్ట్రం కాకుంటే ఆ రాష్ట్రం, ఈ ప్రజలు కాకుంటే ఆ ప్రజలు, ఈ పార్టీతో కాకుంటే ఆ పార్టీతో, ఈ భార్యతో కాకపోతే ఆ భార్యతో అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని పవన్ ను ఇండైరెక్ట్ గా విమర్శించారు. రాజకీయ పార్టీ పెట్టి 14 ఏళ్లు అయిందని.. రెండు నిలబడినా ఒక్కచోట కూడా గెలవలేదని రెండు చోట్లా ప్రజలు ఓడించారంటూ ఒక్క ఎమ్మెల్యే కూడా లేరంటూ జగన్ ఎద్దేవా చేశారు. అలాంటి దత్తపుత్రునికి రాజకీయ నిర్మాత – దర్శకుడు చంద్రబాబు అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఎప్పుడు షూటింగ్ ఉందంటే అప్పుడు అక్కడకు వెళ్తారని.. ఆయన అడిగిన వెంటనే కాల్షీట్లు ఇస్తారని.. చెప్పిన డైలాగ్స్ తో యాక్ట్ చేసి చూపుతారంటూ పవన్ కళ్యాణ పై సీఎం జగన్ ఫైర్ అయ్యారు.

ఇకపోతే ఇదివరకు పవన్ కళ్యాణ్ ను  ప్యాకేజీ స్టార్ అని మూడుపెళ్లిళ్లు చేసుకుంటున్న వ్యక్తికి ఏం తెలుసు రాజకీయాల గురించి అంటూ వైసీపీ నేతలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. దానికి పవన్ కళ్యాణ్ కూడా అదే స్థాయిలో వైసీపీ గాడిదలు, గూండాలకు మాత్రం ఏం తెలుసంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలను చూశాం. మరి ఇప్పుడు సీఎం జగనే నేరుగా ఇలా పవన్ పై విమర్శలు గుప్పించడంపై జనసేనాని మరియు జనసైనికులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

ఇదీ చదవండి: వైసీపీ నేతలు ఫ్రస్టేషన్ లో ఉన్నారు.. చంద్రబాబు నాయుడు

 

Exit mobile version
Skip to toolbar