Site icon Prime9

CM Jagan: చంద్రబాబు హైదరాబాద్ కు లోకల్.. కుప్పానికి నాన్ లోకల్.. సీఎం జగన్

cm jagan

cm jagan

Kuppam: చంద్రబాబు నాయుడు 14ఏళ్లుగా సీఎంగా ఉండి కూడా కుప్పంలో కరువు సమస్యను పరిష్కరించలేకపోయారని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. కుప్పం నుంచి చంద్రబాబు చాలా తీసుకున్నాడని కాని ప్రజలకు ఏం చేయాలో ఆలోచించలేదని అన్నారు. శుక్రవారం కుప్పంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కుప్పం ఎమ్మెల్యే హైదరాబాద్ కు లోకల్, కుప్పం నియోజకవర్గానికి నాన్ లోకల్ అన్నారు.

కుప్పం ఎమ్మెల్యే హైదరాబాద్ కు లోకల్, కుప్పం నియోజకవర్గానికి నాన్ లోకల్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కుప్పం నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ కుప్పానికి చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. తనకు కావాల్సింది కుప్పం నుంచి పిండుకున్నారన్నారు. కుప్పం నుంచి చాలా తీసుకున్నాడు. కానీ ప్రజలకు ఏం చేయాలో ఆలోచించలేదన్నారు. కుప్పంలో బీసీ అభ్యర్థిని నిలబెట్టాలని, చంద్రబాబుకు వారికి అన్యాయం చేశారంటూ వ్యాఖ్యానించారు. అందుకే బీసీ సామాజిక వర్గానికి చెందిన భరత్ కు టిక్కెట్ ఇస్తున్నామని జగన్ తెలిపారు. భరత్‌ను గెలిపించి పంపితే మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీగా ఉంటూనే కుప్పానికి ఎంతో చేయించాడని ప్రశంసించారు.

కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పే చంద్రబాబు కుప్పంలో నీటి సమస్యకు పరిష్కారం చూపలేదన్నారు. హంద్రీ నీవా సమస్యకు చంద్రబాబే అడ్డంకి అన్నారు. తనకు కావాల్సిన వాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చారని వాళ్లు పనులు చేయడం లేదని ఆరోపించారు. కుప్పం మున్సిపాలిటీలో ఒక్క డబుల్ రోడ్ కూడా వేయలేదని జగన్ విమర్శించారు. రోడ్లు వేయలేని చంద్రబాబు విమానాశ్రయం తీసుకొస్తాని ప్రజల చెవిలో పూవులు పెట్టారన్నారు. ఇంత కంటే చేతకాని నాయకుడు ఎక్కడైనా ఉంటారా అని ప్రశ్నించారు. కుప్పం రైతులకు కీలకమైన హంద్రీ నీవా బ్రాంచ్ కెనాల్‌ను ఆరు నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు కప్పంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కొత్తగా నిర్మించిన ప్రభుత్వ భవనాలను ప్రారంభించారు.

Exit mobile version