Site icon Prime9

Chandrababu: అధికారంలోకి వస్తాం.. అభివృద్ధిలోకి తెస్తాం- చంద్రబాబు

chandrababu

chandrababu

Chandrababu: తెదేపా 41వ ఆవిర్భావ దినోత్సవ సభకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన తెదేపా 41న ఆవిర్భావ సభకు హాజరై.. ప్రసంగించారు. రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.

అధికారంలోకి వస్తాం.. (Chandrababu)

తెదేపా 41వ ఆవిర్భావ దినోత్సవ సభకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన తెదేపా 41న ఆవిర్భావ సభకు హాజరై.. ప్రసంగించారు. రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతామని చంద్రబాబు అన్నారు. ఉమ్మడి ఏపీలో అభివృద్ధికి నాంది పలికింది తెదేపా అని తెలిపారు.

41వ ఆవిర్భావ సందర్భంగా.. పార్టీ జెండాను ఆవిష్కరించి.. కేక్ కట్ చేశారు. అనంతరం తెదేపా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తెదేపా అధికారం కోసం స్థాపించిన పార్టీ కాదని.. ప్రజలకు మేలు చేయడానికే పుట్టిందని అన్నారు. ప్రజల కోసం ఎన్టీఆర్ తెచ్చిన సంస్కరణలు చరిత్రలో ఎక్కడ లేవని అన్నారు. చరిత్ర ఉన్నంత కాలం.. తెదేపా ప్రజల గుండెల్లో ఉంటుందని చంద్రబాబు వ్యాఖ్యనించారు.

ఏపీలో హైదరాబాద్ కు దీటుగా.. అమరావతి నిర్మాణం చేపట్టామని అన్నారు. రాజధాని కోసం.. రైతులు వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని తెలిపారు.

విభజన సమయంలో.. ఏపీకి జరిగిన నష్టం కంటే.. జగన్ వల్లే ఎక్కువ నష్టం జరుగుతుందని చంద్రబాబు అన్నారు.

వైసీపీ పాలనలో రాష్ట్రం మరో 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని మండిపడ్డారు. సీఎం సొంత నియోజకవర్గంలో తుపాకీ సంస్కృతి వచ్చిందని విమర్శించారు.

జగన్ పాలనపై ప్రజల్లో తిరుగుబాటు మెదలైందని అన్నారు. దీనికి నిదర్శనం.. ఎమ్మెల్సీ ఎన్నికలే అని తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని.. రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకొస్తామని చంద్రబాబు అన్నారు.

మీ జీవితాన్ని మార్చేది రాజకీయాలే..

తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆర్థిక అసమానతలు తగ్గించడానికి నాంది పలుకుతామని అన్నారు.

సంపద సృష్టించి పేదలకు పంచడం తెదేపాకు తెలుసని చంద్రబాబు వ్యాఖ్యనించారు. ప్రస్తుత కాలంలో.. యువత జీవితాల్ని మార్చేది రాజకీయాలే అని పేర్కొన్నారు.

తెలుగువారి ఆత్మ గౌరవం నిలబెట్టడమే లక్ష్యంగా నవరస నటనా సార్వభౌమ నందమూరి తారక రామారావు ఏర్పాటు చేసిన పార్టీ “తెలుగుదేశం”.

1982 మార్చి 29న పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారికి ప్రత్యేకంగా గుర్తింపు తీసుకొచ్చారు.

ఆత్మగౌరవంతో.. ఢిల్లీ లోనూ రాజకీయాలు చేశారు ఎన్టీఆర్. ప్రధాన ప్రతి పక్షంగా వ్యవహరించిన ఒకే ఒక్క ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం.

ఆ తర్వాత ఓటమిని ఎదుర్కొని మళ్ళీ గెలిచి.. పార్టీ పగ్గాలు ఎన్టీఆర్ నుంచి చంద్రబాబుకి వచ్చి ప్రజల కోసం నిలబడుతూనే ఉంది.

Exit mobile version
Skip to toolbar