Site icon Prime9

Janasena Symbol: జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Janasena Symbol

Janasena Symbol

Janasena Symbol: జనసేనకు గాజు గ్లాసు గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. జనసేన పార్టీకి గాజు గ్లాసును గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు ఈ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి అందాయి. ఒక పక్క పార్టీలో పెరుగుతున్న చేరికలు, మరోవైపు గాజు గ్లాసు గుర్తు ఖరారు చేయడం శుభ సంకేతాలని పార్టీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

తెలంగాణ ఎన్నికల్లో కూడా..(Janasena Symbol)

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. గత సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపైనే జనసేన అభ్యర్ధులు పోటీ చేసిన విషయం విదితమే. అదే విధంగా ఈ సారి ఎన్నికల్లో కూడా గాజు గ్లాసు గుర్తుతోనే జనసేన అభ్యర్ధులు ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఈ ఉత్తర్వు కాపీలను పార్టీ లీగల్ సెల్ చైర్మన్ సాంబశివ ప్రతాప్ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు అందచేశారు. వాస్తవానికి గత ఏడాదే స్దానిక సంస్దల ఎన్నికలకు గాను జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. ఇపుడు సార్వత్రిక ఎన్నికలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఈ గుర్తును ఖరారు చేసింది.

గాజు గ్లాసు జనసేనదే..ఫిక్స్ చేసిన ఈసీ | EC Confirm To Glass Symbol For Janasena | Prime9 News

Exit mobile version
Skip to toolbar