Site icon Prime9

Bharat Jodo Yatra: రాహుల్ టి షర్ట్ పై బిజెపి రగడ.. కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్..

BJP ragada on Rahul t-shirt

BJP ragada on Rahul t-shirt

Bharat Jodo Yatra: ఖరీదైన కార్లలో నేతలు అనేక కార్యక్రమాలకు వస్తుంటారు.పేద ప్రజలు ఉద్దేశించి ఉపన్యాసాలు ఇస్తుంటారు. అనంతరం తమ తమ ప్రాంతాలకు అదే ఖరీదైన వాహనాల్లో వెళ్లిపోతుంటారు. ఇవన్నీ నిత్యం మనం చూస్తున్న సంఘటనలే. అయితే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి  ప్రస్తుతం కాంగ్రెస్ ఫీవర్ పట్టుకొనింది. ఆ వివరాలు తెలుసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై ఓ లక్కెయ్యాల్సిందే.

ఈ నెల 7న రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రకు కన్యాకుమారి నుండి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తిరునల్వేలిలో అగ్రనేత రాహుల్ మీడియా సమావేశంలో టీఫర్ట్ వేసుకొని మాట్లాడారు. అయితే బిజెపి ఇక్కడే రాజకీయం చేసేందుకు ప్రయత్నించింది. రాహుల్ ధరించిన టీ షర్ట్ బర్ బెర్రీ బ్రాండ్ కు చెందినది అని దాని ధర రూ. 41257 అంటూ ఖరీదైన దుస్తులు ధరించిన రాహుల్ ధరలు పెరుగుదల, నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేసింది. రాహుల్ నిర్వహిస్తున్న యాత్రలో ఆ పార్టీ నేతలు సైతం వినియోగిస్తున్న కంటైనర్లు కూడా విలాసవంతంగా ఉన్నాయని బిజెపి గట్టిగా ప్రజలకు తెలియచేసే ప్రయత్నం చేసింది.

కాంగ్రెస్ నేతలు కూడా తగ్గేదేలా అంటూ బిజెపి పై ఎదురుదాడికి దిగారు. జోడో యాత్రతో రాహుల్ కు వస్తున్న అనూహ్య స్పందన చూసి ఓర్వలేక బిజెపి నేతలు ఇలా మాట్లాడుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు విమర్శించారు. విలేకర్లతో రాహుల్ మాట్లాడిన మాటల్లో, బిజెపి, ఆర్ ఎస్ఎస్ సంయుక్తంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయడమే జోడో యాత్ర ముఖ్యోద్దేశంగా ఆయన తెలిపారు. ప్రజలతో మమేకం అయ్యేందుకు జోడో యాత్ర ఎంతగానో ఉపయోపడుతుందని భావించడం వల్లే తాను ఈ యాత్ర చేపట్టిన్నట్లు రాహుల్ పేర్కొన్నారు. ప్రతిపక్షాలపై ఒత్తిడి తెచ్చేందుకు వ్యవస్ధలను బిజెపి ఉపయోగించుకొంటుందన్న రాహుల్ గాంధీ, మా పోరాటం రాజకీయ పార్టీల మద్య కాదని తెలుసుకోవాలన్నారు. మూడు నెలల పాటు సాగే జోడో యాత్రకు నేను రధ సారధి కాదని, కేవలం నా అందమైన దేశం గురించి మరింత అవగాహన చేసుకొనేందుకు యాత్ర ఉపయోగంగా ఉంటుందని రాహుల్ మాటలతో అందరూ ఫిదా అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగిన్నప్పుడు ఎవరు అనే అంశం పై క్లారీటీ వస్తుందని, తాను ఆ పదవిలో ఉంటానో లేదో వేచి చూడాలని, ఆ విషయం తాను చాలా స్పష్టంగా ఉన్నాని రాహుల్ కుండ బద్దలు కొట్టిన్నట్లు తెలిపారు.

Exit mobile version