Andhra Pradesh: ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చంద్రబాబు, పవన్ కలయిక పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్‌ను చంద్రబాబు కలవడాన్ని స్వాగతిస్తున్నానన్నారు. జగన్ సర్కార్ ప్రోద్బలంతోనే విశాఖలో పవన్ యాత్రను అడ్డుకున్నారని మండిమడ్డారు. ఇక పవన్ కల్యాణ్‌కు బిజెపి పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న సోము వీర్రాజు బీజేపీ, జనసేన కలిసే ముందుకు వెళతాయని స్పష్టం చేశారు.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజాస్వామ్యం పై దాడి జరిగిందని గుర్తుచేశారు. మాజీ అధ్యక్షడు కన్నా లక్ష్మీ నారాయణ తన పై చేసిన వ్యాఖ్యలను కూడా పార్టీ అదిష్టానం దృష్టిలో ఉంచునట్లు తెలిపారు. కన్నా విషయంలో ఇంతకు మించి ఎక్కువ మాట్లడడానికి లేదన్నారు. రాజకీయాలలో అన్నీ ఉంటాయని దీనిని మీడియా అతి చేయాల్సిన పనిలేదన్నారు.
బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తో సమన్వయం చేసుకోవడంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం వైఫల్యం చెందిందన్నారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పై విమర్శలు చేశారు. అన్నీ తానే చేయాలనే వీర్రాజు వైఖరి వల్లే ఈ పరిస్థితి నెలకొందన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన కన్నా లక్ష్మీనారాయణ నిన్న సాయంత్రం తన అనుచరులతో భేటీ అయ్యారు. కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారుతారనే ప్రచారం సాగుతుంది. ఈ విషయమై కన్నా లక్ష్మీనారాయణ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.