Site icon Prime9

Rahul Gandhi: ‘భారత్ జోడో యాత్ర’.. 150 రోజులు కంటైనర్ లోనే రాహుల్ గాంధీ పడక

rahul-gandi-jodo-yatra

Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొంటున్న దాదాపు 230 మంది కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ మాదిరే రాత్రి పూట కంటైనర్లలో బస చేస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ గురువారం తెలిపారు. ఇందుకోసం 60 ట్రక్కులను సిద్దం చేసామని వీటిని ప్రతిరోజూ ఒక చోటు నుంచి మరో చోటికి తరలిస్తారని అన్నారు. వీటిలో టీవీ ఉండదని ఫ్యాన్ మాత్రం ఉంటుందని అన్నారు. బుధవారం రాత్రి నుంచి రాహుల్ గాంధీ కూడా కంటైనర్‌లోనే ఉంటున్నారని ఆయన తెలిపారు.

కొన్ని కంటైనర్లు ఒక మంచం, కొన్ని రెండు పడకలు, కొన్ని నాలుగు పడకలు. మరియు కొన్ని 12 పడకలు కలిగి ఉన్నాయి. ఇవి కేవలం నిద్రపోవడానికి మాత్రమే. భోజనం లేదా సమావేశాలు ఏర్పాటు చేసుకునే సౌకర్యం లేదు. ఈ కంటైనర్లు తాత్కాలిక శిబిరాల వద్ద మోహరింపబడి ఉంటాయి. కొన్ని కంటైనర్లలో మరుగుదొడ్లు మరియు వాష్‌రూమ్‌లు ఉన్నాయి.

రాహుల్ గాంధీతో సహా 119 మంది “భారత్ యాత్రికులు” మొత్తం 3,570 కి.మీ దూరం నడవనున్నారు, మరికొందరు అప్పటికపుడు పాదయాత్రలో పాల్గొనేవారు కూడ కంటైనర్‌లలో ఉంటారు. భారత్ జోడో యాత్ర ఆర్గనైజింగ్ ప్యానెల్ చీఫ్ దిగ్విజయ్ సింగ్ కంటైనర్లు రైల్వే స్లీపర్ కంపార్ట్‌మెంట్‌ల లాంటివని అన్నారు.

Exit mobile version