Site icon Prime9

Revanth Reddy: భారత్ జోడో యాత్ర.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే.. రేవంత్

Bharat Jodo Yatra...for the protection of democracy

Bharat Jodo Yatra...for the protection of democracy

Bharath Jodo Yatra: రాహుల్ గాంధీ సారధ్యంలో సాగుతున్న కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర కేవలం ఎన్నికల కోసమే కాదని, దేశ ప్రయోజనాలు, ప్రజాస్వామ్య పరిరక్షణకు చేస్తున్న యాత్రంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అక్టోబర్ 24 నుండి తెలంగాణాలో రాహుల్ జోడో యాత్ర ప్రారంభంకానున్నా నేపథ్యంలో పలువురు సీనియర్ నేతలతో ఆయన సమావేశమైనారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అక్టోబర్ 4న జోడో యాత్ర ఏర్పాట్ల పై చర్చించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ హైదరాబాదుకు రానున్నట్లు తెలిపారు. అదే క్రమంలో రాహుల్ పాద యాత్ర అనుమతి కోసం డీజీపీని కలువనున్నట్లు రేవంత్ పేర్కొన్నారు.

ఈ నెల 7న తమిళనాడు కన్యాకుమారి నుండి రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పాదయాత్ర పూర్తి చేసుకొని కర్ణాటకలోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశించింది. అనంతరం తెలంగాణాలోకి జోడో యాత్ర చేరుకోనున్న నేపథ్యంలో తెలంగాణాలో కాంగ్రెస్ శ్రేణులు సమాయత్తమౌతున్నారు.

మరోవైపు కొద్ది నెలల్లోనే తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతోపాటు నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక జరిగే అవకాశాలు ఉండడంతో రాహుల్ యాత్ర తెలంగాణా కాంగ్రెస్ బలోపేతానికి మరింత ఉపయోగపడనుంది. మీడియా సమావేశంలో రేవంత్ తో పాటు పలువరు కాంగ్రెస్ సీనియర్లు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: గుజరాత్ లో రూ.25.80కోట్ల నకిలీ నోట్లు.. పట్టుబడ్డ నోట్లన్నీ రెండు వేల రూపాయలే

Exit mobile version