Site icon Prime9

Balakrishna: ఎన్టీఆర్ అన్నది పేరు కాదు.. తెలుగు జాతి వెన్నెముక.. నందమూరి బాలకృష్ణ

Balakrishna

Balakrishna

Balakrishna: విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు మార్చడం పై బాలకృష్ణ స్పందించారు. మార్చటానికి, తీసేయ్యడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదని, తెలుగు జాతి వెన్నెముక అని ట్వీట్ చేశారు.
తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చారనికొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నారని, మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారని ఎద్దేవా చేశారు.

మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి ఎన్టీఆర్ అన్నది పేరుకాదు. ఓ సంస్కృతి, ఓ నాగరికత, తెలుగు జాతి వెన్నెముక, తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు. పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త. అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు. పీతలున్నారు. విశ్వాసం లేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయి. శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు అని బాలయ్య ట్వీట్‌లో పేర్కొన్నారు.

Exit mobile version