Balakrishna: తెదేపా 41వ ఆవిర్భావ దినోత్సవ సభలో హిందూపురం ఎమ్మెల్యే.. నటుడు బాలకృష్ణ మాట్లాడారు. ఎన్టీఆర్ పాలనలో సాహసోపేతమైన నిర్ణయాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లారని తెలిపారు. మరోవైపు అధికార వైసీపీ పై బాలయ్య పలు విమర్శలు చేశారు.
నేటీతో 41 ఏళ్లు.. (Balakrishna)
తెదేపా 41వ ఆవిర్భావ దినోత్సవ సభలో హిందూపురం ఎమ్మెల్యే.. నటుడు బాలకృష్ణ మాట్లాడారు. ఎన్టీఆర్ పాలనలో సాహసోపేతమైన నిర్ణయాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లారని తెలిపారు. మరోవైపు అధికార వైసీపీ పై బాలయ్య పలు విమర్శలు చేశారు. ప్రజల గుండెల్లో ఎన్టీఆర్‌కు ఎప్పుడు మరణం లేదని.. నిత్యం వెలిగే మహోన్నత దీపమని బాలకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీర్ చేసిన సేవలను గుర్తు చేశారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో తెదేపా 41వ ఆవిర్భావ దినోతవ్స సభ జరిగింది. ఈ సభలో బాలయ్య మాట్లాడుతూ.. పేదల ఆకలి తెలిసిన వ్యక్తి ఎన్టీఆర్. ప్రతి తెలుగు బిడ్డ సగర్వంగా తలఎత్తుకునేలా చేశారని తెలిపారు. ప్రజలకు అండగా.. నవజాతి మార్గదర్శకంగా ఎన్టీఆర్ తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. ప్రజల గుండెల్లో ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరని అన్నారు. అలాగే ఏపీలో కొనసాగుతున్న అరాచక పాలనపై బాలకృష్ణ ఘాటుగా స్పందించారు.
పేరును మార్చడం దౌర్భాగ్యం
గూడులేని పేదలకు.. ఇళ్ల పథకం ఎన్టీఆర్ తీసుకొచ్చారు. అలాగే పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి.. ప్రజలకు మేలు చేశారని బాలయ్య అన్నారు.
ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన గొప్ప నేత అని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు.. మహిళలకు స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పించారని తెలిపారు.
అలాంటి గొప్ప వ్యక్తికి గుర్తుగా పెట్టిన ఎన్టీఆర్ వర్సిటీ పేరును వైకాపా ప్రభుత్వం మార్చడం దౌర్భాగ్యమని మండిపడ్డారు.
తెలుగువారి ఆత్మ గౌరవం నిలబెట్టడమే లక్ష్యంగా నవరస నటనా సార్వభౌమ నందమూరి తారక రామారావు ఏర్పాటు చేసిన పార్టీ “తెలుగుదేశం”.
1982 మార్చి 29న పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారికి ప్రత్యేకంగా గుర్తింపు తీసుకొచ్చారు.
ఆత్మగౌరవంతో.. ఢిల్లీ లోనూ రాజకీయాలు చేశారు ఎన్టీఆర్. ప్రధాన ప్రతి పక్షంగా వ్యవహరించిన ఒకే ఒక్క ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం.
ఆ తర్వాత ఓటమిని ఎదుర్కొని మళ్ళీ గెలిచి.. పార్టీ పగ్గాలు ఎన్టీఆర్ నుంచి చంద్రబాబుకి వచ్చి ప్రజల కోసం నిలబడుతూనే ఉంది.