Site icon Prime9

Goa Congress crisis: బీజేపీలో చేరిన ఎనిమిది మంది గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

goa-congress-mlas-join-bjp

Goa: మాజీ సీఎం దిగంబర్ కామత్, ప్రతిపక్ష నేత మైఖేల్ లోబో సహా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం గోవాలో బీజేపీలో చేరారు. దీనితో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు.

బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలలో దిగంబర్ కామత్, మైఖేల్ లోబో, డెలిలా లోబో, రాజేష్ ఫాల్దేశాయ్, కేదార్ నాయక్, సంకల్ప్ అమోంకర్, అలీక్సో సిక్వేరా మరియు రుడాల్ఫ్ ఫెర్నాండెజ్ ఉన్నారు. వారు సీఎం ప్రమోద్ సావంత్‌ను కూడా కలిశారు. ప్రధాని మోదీ, సీఎం ప్రమోద్‌ సావంత్‌ చేతులను బలోపేతం చేసేందుకు బీజేపీలో చేరామని అని కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే మైఖేల్‌ లోబో అన్నారు. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 11 మంది, బీజేపీకి 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జూలై 2019లో ఇదే తరహాలో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి మారారు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్‌ను రక్షించడం పై దృష్టి పెట్టాలి. రాహుల్ గాంధీ రోడ్డు పై ఉన్న సమయంలో కాంగ్రెస్‌ను డంప్ చేయాలని 8 మంది గోవా ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్‌కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేని అనేక రాష్ట్రాలు ఉన్నాయని అన్నారు.

Exit mobile version