Site icon Prime9

Bandi Sanjay: అక్టోబర్ 15 నుండి బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర

Bndi sanjay yatra

Bndi sanjay yatra

Hyderabad: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర అక్టోబర్ 15 నుండి ప్రారంభం కానుంది. ఐదో విడతలో భైంసా నుండి కరీంనగర్ వరకు పాదయాత్ర చేయనున్నారు బండి సంజయ్. బాసర అమ్మవారిని దర్శించుకుని, భైంసా నుంచి యాత్ర మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే ప్రజా సంగ్రామ యాత్ర 4 విడతల్లో 48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 వందల 60 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు. గత ఏడాది ఆగస్ట్ 28న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుండి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించారు.

బాసర అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి బైంసా నుండి పాదయాత్రను బండి సంజయ్ మొదలు పెట్టనున్నట్లు బిజెపి శ్రేణులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నారు. బండి సంజయ్ నాలుగు విడతలుగా పాదయాత్రను కొనసాగించి 48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు. మొత్తం బండి సంజయ్ పన్నెండు వందల అరవై కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.

Exit mobile version