Site icon Prime9

Manipur: మణిపూర్.. బీజేపీలో చేరిన ఐదుగురు జెడి(యు) ఎమ్మెల్యేలు

JDU-5-MLAs-join-BJP

Manipur: మణిపూర్ రాజకీయాల్లో కీలకపరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆరుగురు జనతాదళ్ (యునైటెడ్) ఎమ్మెల్యేలలో ఐదుగురు శుక్రవారం అధికార భారతీయ జనతా పార్టీలో విలీనమయ్యారు. ఇది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు పెద్ద ఎదురుదెబ్బనే చెప్పవచ్చు.

గత రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో, మణిపూర్ అసెంబ్లీ కార్యదర్శి కె మేఘజిత్ సింగ్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఐదుగురు జెడియు ఎమ్మెల్యేల విలీనానికి స్పీకర్ తోక్‌చోమ్ సత్యబ్రత సింగ్ అంగీకరించారు. విలీనమయిన వారిలో ఖుముక్చమ్ జోయ్‌కిసన్ సింగ్, న్గుర్‌సంగ్లూర్ సనేట్ , మహ్మద్ అచాబ్ ఉద్దీన్ , తంజామ్ అరుణ్‌కుమార్ (వాంగ్‌ఖేయ్),ఎల్‌ఎం ఖౌటే ఉన్నారు. జెడి (యు) 60 మంది సభ్యుల మణిపూర్ అసెంబ్లీలో ఆరు స్థానాలను గెలుచుకుని ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వానికి తమ మద్దతును అందించింది.

మరోవైపు అరుణాచల్ మరియు మణిపూర్ రెండింటిలోనూ @BJP4Indiaని ఓడించడం ద్వారా జెడి (యు) సీట్లు గెలుచుకున్న విషయాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. కాబట్టి జెడి(యు) నుంచి విముక్తి గురించి పగటి కలలు కనవద్దు అంటూ జెడి(యు) జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ హిందీలో ట్వీట్ చేసారు.

Exit mobile version