"శ్రద్ధా దాస్".. అల్లరి నరేష్ నటించిన సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య 2 చిత్రంలో తనదైన నటనతో ప్రేక్షకుల్లో, మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. అనంతరం డార్లింగ్, గుంటూరు టాకీస్, గరుడ వేగ వంటి సినిమాలో సందడి చేసింది.