Sourav Ganguly: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీకి భద్రత పెంచనున్నారు. ఇప్పటివరకు దాదాకు వై కేటగిరీ భద్రతను కల్పిస్తున్నారు. ఇది మే 16తో ముగియడంతో.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ భద్రతను.. వై’ నుంచి ‘జెడ్’ కేటగిరీకి అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీకి భద్రత పెంచనున్నారు. ఇప్పటివరకు దాదాకు వై కేటగిరీ భద్రతను కల్పిస్తున్నారు. ఇది మే 16తో ముగియడంతో.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ భద్రతను.. వై’ నుంచి ‘జెడ్’ కేటగిరీకి అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.
సౌరబ్ గంగూలీ భద్రత విషయంలో మమతా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
మెున్నటి వరకు వై కేటగిరీ ప్రకారం.. గంగూలీ నివాసం వద్ద ముగ్గురు స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారులు, ముగ్గురు లా ఎన్‌ఫోర్సర్స్ (చట్టాన్ని అమలు చేసేవారు) ఉండేవారు.
ఇపుడు దీనిని జెడ్ కెటగిరీకి అప్ గ్రేడ్ చేశారు. దీని ప్రకారం భద్రత దళం సంఖ్య ఎనిమిది నుండి పది మంది పోలీసు అధికారులతో (24 గంటల పాలు) కూడినది ఉంటుంది. సౌరబ్ ప్రస్తుతం దిల్లి క్యాపిటల్స్ కు
డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. దిల్లీ జట్టు ప్రస్తుతం ఈ ఐపీఎల్ సీజన్‌లో పేలవ ప్రదర్శనను కనబరుస్తుంది.
ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.
ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్‌లో ఇంకా 2 మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు.
ఈ సీజన్ ప్రారంభానికి ముందు రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో అతని స్థానంలో డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్‌గా నియమించారు.
వార్నర్ వ్యక్తిగతంగా రాణించినా.. మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో డీసీకి ఈ గతి పట్టింది.