Site icon Prime9

Asaduddin Owaisi: గుజరాత్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తాము.. అసదుద్దీన్ ఒవైసీ

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Gujarat: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలుచుకుంటుందని ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో లోపాన్ని బహిర్గతం చేస్తూ తాము ప్రయోజనాలను పొందుతామని ఒవైసీ అన్నారు. గుజరాత్ ఎన్నికల్లో మజ్లిస్ తరపును పోటీచేసే 40 మంది అభ్యర్థులను గుర్తించిన పార్టీ తుది జాబితాను ఖరారు చేయనుంది.

కోవిడ్ -19 మహమ్మారిని బీజేపీ ప్రభుత్వం సరిగా ఎదుర్కోలేకపోయిందని ఇది ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యమని అన్నారు. ఆసుపత్రులలో సౌకర్యాల కొరత కారణంగా, చాలా మంది వ్యక్తులు కోవిడ్‌కు లొంగిపోయారు. వ్యాపారాలు దెబ్బతిన్నాయన్నారు. మోర్బీ బ్రిడ్జి దుర్ఘటన దురదృష్టకర ఘటన అని దీనికి పనికిరాని పరిపాలనే కారణమని ఆరోపించారు. కాంట్రాక్టు పొందిన కంపెనీకి అనుభవం లేదు. స్థానిక మున్సిపల్ అధికారులు ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌లను పొందకముందే బ్రిడ్జిని తెరిచారన్నారు.

బీజేపీ బీ-టీమ్‌గా కొనసాగుతున్న ఆరోపణల పై ఒవైసీ మాట్లాడుతూ తమ పార్టీకి ఎవరి సర్టిఫికెట్‌ అవసరం లేదని అన్నారు. ఆ రాజకీయ పార్టీల నాయకులను వారు మమ్మల్ని ఏమని పిలవాలనుకుంటున్నారో నిర్ణయించుకోమనండి అని ఒవైసీ పేర్కొన్నారు.

Exit mobile version