Site icon Prime9

Bypolls: ఐదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ, మెయిన్ పురి పార్లమెంట్ స్దానంలో కొనసాగుతున్న పోలింగ్

Bypolls

Bypolls

Bypolls: ఐదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో సోమవారం పోలింగ్ ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ సదర్, ఖతౌలీ, ఒడిశాలోని పదంపూర్, రాజస్థాన్‌లోని సర్దార్‌షహర్, బీహార్‌లోని కుర్హానీ, ఛత్తీస్‌గఢ్‌లోని భానుప్రతాపూర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్‌ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, రాజస్థాన్‌లో ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.ఉత్తరప్రదేశ్‌లో, రాంపూర్ సదర్ మరియు ఖతౌలీ అసెంబ్లీ స్థానాలు మరియు మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ మరియు సమాజ్‌వాదీ పార్టీ-రాష్ట్రీయ లోక్‌దళ్ (RLD) కూటమి మధ్య ప్రత్యక్ష పోటీ ఉంది. బీఎస్పీ, కాంగ్రెస్‌లు ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుండగా, ఎస్‌పి ఎమ్మెల్యే ఆజం ఖాన్, బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ సైనీలు అనర్హులుగా తేలడంతో తర్వాత రాంపూర్ సదర్, ఖతౌలీలలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.2019 ద్వేషపూరిత ప్రసంగం కేసులో కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించడంతో అజంఖాన్ , 2013 ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో దోషిగా తేలిన తర్వాత సైనీ అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోయారు.డిసెంబర్ 8న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బ్యాలెట్ లెక్కింపుతో పాటు మెయిన్ పురి పార్లమెంట్, ఆరు అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది.

Exit mobile version