Site icon Prime9

BJP manifesto : యూనిఫాం సివిల్ కోడ్ , రెండు ఎయిమ్స్ ఆసుపత్రులు.. గుజరాత్ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో

BJP manifesto

BJP manifesto

BJP manifesto: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం గాంధీనగర్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్  సమక్షంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ‘సంకల్ప్ పత్ర’ లేదా ‘మేనిఫెస్టో’ని విడుదల చేసారు. ఇందులో ప్రధాన అంశాలు ఈ విధంగా ఉన్నాయి.

గుజరాత్‌లో యూనిఫాం సివిల్ కోడ్‌ పూర్తిగా అమలు
‘యాంటీ-రాడికలైజేషన్’ సెల్‌ ఏర్పాటు
గుజరాత్ ఆర్థిక వ్యవస్థను 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడం
మూడు సివిల్ మెడిసిటీలు, రెండు ఎయిమ్స్-గ్రేడ్ సంస్థలు ప్రస్తుత ఆరోగ్య సంరక్షణ సదుపాయాలలో మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడానికి రూ. 10,000 కోట్లతో మహారాజా శ్రీ భగవత్సింహ్‌జీ స్వాస్థ్య కోష్‌ ఏర్పాటు . ఇవి కాకుండా సాగునీటి సౌకర్యాల కోసం రూ.25 వేల కోట్లు ప్రకటించడంతో రాష్ట్రంలోని రైతు మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయిస్తానని బీజేపీ హామీ ఇచ్చింది.

Exit mobile version