Site icon Prime9

Starlink Satellite: ఏంటీ వింత.. ఆకాశంలో కదులుతున్న రైలు..!

Starlink Satellites 

Starlink Satellites 

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో సోమవారం అర్థరాత్రి ఆకాశంలో ఓ అద్భుత దృశ్యం కనిపించింది. కటిక చీకటిలో ప్రకాశవంతంగా వెలుగుతూ ఓ నక్షత్రాల గొలుసు( కదులుతున్న రైలు) లాంటి ఆకారం కదులుతూ అక్కడి ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది.

యూపీలోని ఫరూఖాబాద్‌లో గతరాత్రి “ఆకాశంలో కదులుతున్న రైలు” అందరినీ ఆశ్చర్యపరిచింది. దానిని చూసిన ప్రజలు ఆ అద్భుత దృష్యాన్ని చరవాణిలో చిత్రీకరించి నెట్టింట హల్చల్ చేస్తున్నారు. నాసా శాస్రవేత్తలను ట్యాగ్ చేస్తూ ఈ వింత ఏమిటో చెప్పమంటూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. అయితే వాస్తవానికి భారతదేశంలో ఆకాశంగా గుండా ప్రయాణించిన ఆ తేజోవంతమైన నక్షత్రాల గొలుసును ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ఎలన్ మస్క్ యొక్క స్టార్‌లింక్ ఉపగ్రహాలని పేర్కొంటున్నారు.

ఎలన్ మస్క్ ప్రతి నెలా ఈ ఉపగ్రహాలను తన ఫాల్కన్-9కి పంపుతుంటాడట. ఈ ఫాల్కన్-9 రాకెట్ ద్వారా స్పేస్ లోకి పంపబడుతుందని, అయితే ఈ రాకెట్‌లో రెండు దశలు ఉంటాయని కొందరు వెల్లడిస్తున్నారు. మొదటి దశలో రాకెట్ ప్రయోగించిన 9 నెలల తర్వాత భూమికి తిరిగి వస్తుంది. అయితే, రెండవ దశ స్టార్‌లింక్ ఉపగ్రహాలను తక్కువ భూమి కక్ష్యలో ఉంచుతూ కొంత సమయం తర్వాత భూమి పై క్రాష్ ల్యాండింగ్ చేస్తుంది. కాగా గతేడాది డిసెంబర్‌లో పంజాబ్‌లో కూడా స్టార్‌లింక్ ఉపగ్రహాలు కనిపించాయని కొందరు తెలిపారు.

ఇదీ చూడండి: కోహినూర్ వజ్రం పూరీ జగన్నాథుడిదే.. తిరిగి ఇచ్చేయాలి..

 

Exit mobile version