Site icon Prime9

Chandrayaan-3: చందమామను ముద్దాడనున్న ఇస్రో.. చంద్రయాన్-3 కౌంట్‌డౌన్‌ స్టార్ట్

Chandrayaan-3

Chandrayaan-3

Chandrayaan-3: ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్‌ –3 ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ మొదలయ్యింది. ఏపీలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లోని లాంచ్‌ పాడ్‌ 2 నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35కు ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌ ద్వారా చంద్రయాన్‌ ల్యాండర్‌, రోవర్‌ను చంద్రుడిపైకి పంపనున్నారు శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగం అన్ని విధాలుగా విజయవంతం అవుతుందని గతంలోని వైఫల్యాలను అధిగమించి ఈ సారి సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యేలా అన్ని చర్యలు తీసుకున్నామని ఇస్రో మాజీ ఛైర్మన్‌ జీ మాధవన్‌ నాయర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇకపోతే చంద్రయాన్-3 కనుక విజయవంతం అయితే మూన్ మిషన్ ని విజయవంతం చేసిన దేశాల లిస్టులో భారత్ నాలుగో దేశంగా చరిత్ర సృష్టించనుంది. గతంలో చంద్రుడిపైగా రోవర్ ను ప్రయోగించిన అమెరికా, రష్యా, చైనాలు మూన్‌ మిషన్‌ కోసం వేలకోట్లు ఖర్చు చేశాయి. అయితే ఇస్రో మాత్రం రూ.650 కోట్ల బడ్జెట్‌తోనే ఇంతటి ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని చేపట్టినట్టు సమాచారం.

ఇదిలా ఉంటే గతంలో చందమామపైకి ల్యాండర్‌ను జారవిడిచే చంద్రయాన్‌ -1 ప్రయోగాన్ని విజయవంతంగా చేసిన ఇస్రో, చంద్రుడిపై రోవర్‌ను దింపే లక్ష్యంతో 2019 జూలై 22న చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగం విఫలమైంది. కాగా ఇప్పుడు చంద్రయాన్ 3 ప్రయోగానికి సిద్ధమైంది. ఆగస్టు 23 లేదా 24న చంద్రుడిపై ల్యాండర్‌ సేఫ్ గా దిగుతుంది.

ప్రయోగంలో మూడు మాడ్యూల్స్‌(Chandrayan-3)

ప్రొపల్షన్‌ మాడ్యూల్‌: రాకెట్‌ను నింగిలోకి తీసుకుపోయే మాడ్యూల్‌ ఇది. ఈ మాడ్యూల్‌.. రాకెట్‌ను భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టి వేరుపడిపోతుంది.

ల్యాండర్‌ మాడ్యూల్‌: చంద్రుడిపైకి రోవర్‌ను మోసుకెళ్లి దించేది ఇదే. రాకెట్‌ నుంచి విడిపోయిన తర్వాత నిర్ణీత సుదూర కక్ష్యకు చేరుకొని చంద్రుడివైపు ప్రయాణిస్తుంది. చంద్రుడి ఉపరితలం నుంచి 100 కి.మీ ఎత్తులోని కక్ష్యలోకి చేరుకొంటుంది. దక్షిణ ధ్రువం వద్ద ఉపరితలంపై ల్యాండర్‌ దిగగానే రోవర్‌ బయటకు వస్తుంది.

రోవర్‌: చంద్రుడి ఉపరితలాన్ని అధ్యయనం చేసేందుకు రూపొందించిన పరికరమే రోవర్‌. ఇది చందమామపై ఉన్న మట్టి, మంచును పరిశీలించి సమాచారాన్ని భూమికి చేరవేస్తుంది. ఈ రోవర్‌ జీవితకాలం 14 రోజులు.

40 రోజుల ప్రయాణం

రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లిన 16 నిమిషాల తర్వాత ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ విడిపోతుంది. ఆ తర్వాత ల్యాండర్‌ భూమి చూట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతుగుతూ 40 రోజుల తర్వాత చంద్రయాన్‌-3 చంద్రుడిని చేరుకొంటుంది.

Exit mobile version