Himachal pradesh: హిమాచల్ ప్రదేశ్‌ సీఎంగా సుఖ్‌విందర్ సింగ్ సుఖు

హిమాచల్ ప్రదేశ్‌ సీఎంగా సుఖ్‌విందర్ సింగ్ సుఖు, డిప్యూటీ సీఎంగా ముఖేష్ అగ్నిహోత్రిని కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది

  • Written By:
  • Publish Date - December 11, 2022 / 09:30 AM IST

Himachal pradesh: హిమాచల్ ప్రదేశ్‌ సీఎంగా సుఖ్‌విందర్ సింగ్ సుఖు, డిప్యూటీ సీఎంగా ముఖేష్ అగ్నిహోత్రిని కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. హమీర్‌పూర్ జిల్లాలోని నదౌన్ నుండి ఎమ్మెల్యే గా గెలిచిన 58 ఏళ్ల సుఖు సిఎల్‌పి నాయకుడిగా ఎన్నికయ్యారు . ఆయన ఆదివారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ తెలిపింది. శుక్రవారం సాయంత్రం జరిగిన సమావేశంలో శాసనసభా పక్ష నేతను ఎంపిక చేసేందుకు పార్టీ అధ్యక్షుడికి అధికారం ఇస్తూ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మానం చేసిన విషయం తెలిసిందే.

హిమాచల్ ప్రదేశ్ లోని మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు గానూ 40 స్థానాలను కాంగ్రెస్చేజిక్కించుకుంది. సుఖు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అతను పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి సన్నిహితుడు.హిమాచల్ ప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి ఆదివారం (డిసెంబర్ 11) ఉదయం 11:00 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారని ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్ తెలిపారు.మేము చాలా మంచి ప్రభుత్వాన్ని నడుపుతాము. రేపు ప్రమాణ స్వీకారోత్సవానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మరియు మల్లికార్జున్ ఖర్గే హాజరవుతారని” కాంగ్రెస్ నాయకుడు భూపిందర్ సింగ్ హుడా అన్నారు.