Site icon Prime9

Uttar Pradesh: యూపీలో దారుణం..10ఏళ్ల బాలుడ్ని నరబలి ఇచ్చిన బంధువు

shocking murder case happened in bihar

shocking murder case happened in bihar

Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మూఢ నమ్మకాలతో.. రెండేళ్ల కుమారుడిని కాపాడుకునేందుకు ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. తాంత్రికుడు చెప్పాడని.. పదేళ్ల బాలుడిని నరబలి ఇచ్చాడు.

కుమారుడి ఆరోగ్యం కోసం నరబలి.. (Uttar Pradesh)

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మూఢ నమ్మకాలతో.. రెండేళ్ల కుమారుడిని కాపాడుకునేందుకు ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు.

తాంత్రికుడు చెప్పాడని.. పదేళ్ల బాలుడిని నరబలి ఇచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పెరుగుతున్న.. ఇంకా మూఢ నమ్మకాలు పోవట్లేదు.

మూఢ విశ్వాసాలతో.. ఘాతుకాలకు పాల్పడుతున్నారు. తాంత్రికుడు చెప్పాడని.. కుమారుడి ఆరోగ్యం కోసం బంధువు కుమారుడినే నరబలిచ్చాడు ఓ వ్యక్తి.

బాలుడు కనిపించకపోవటంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అసలు నిజాన్ని తేల్చారు. అలాగే ఈ ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

కొడుకు కనిపించక పోవటంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని బహ్రైచ్ జిల్లా పర్సా గ్రామానికి చెందిన కృష్ణ వర్మకు పదేళ్ల కుమారుడు ఉన్నాడు.

అతడి కుమారుడు పేరు వివేక్ వర్మ. కృష్ణ వర్మకు సమీప బంధువు అనూప్ ఉన్నాడు. ఇతడికి రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నాడు.

అయితే తరచూ అనూప్ కుమారుడి ఆరోగ్య స్థితి సరిగా ఉండేది కాదు. వైద్యులు, మంత్రగాళ్ల వద్దకు తిప్పిన ప్రయోజనం లేకుండా పోయింది.

దీంతో ఓ తాంత్రికుడి వద్దకు వెళ్లి కుమారుడి ఆరోగ్య పరిస్థితి వివరించాడు. తాంత్రికుడు నరబలి ఇస్తే బాగుంటుందని వివరించాడు. పదేళ్లు, అంతకన్న తక్కువ వయస్సు గల బాలుడిని నరబలి ఇవ్వాలని సూచించాడు. దీంతో అనూప్ తన బంధువు కృష్ణ వర్మ కుమారుడిని బలిచ్చేందుకు నిర్ణయించుకున్నాడు. ఎవరు లేని సమయంలో.. బాలుడిని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి నరబలి ఇచ్చాడు. కుమారుడు కనిపించక పోవటంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విచారణ చేపట్టిన పోలీసులకు అనూప్ పై అనుమానం వచ్చింది. అనూప్ ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అనూప్, అతనికి సహకరించిన చింతారామ్‌తో పాటు తాంత్రికుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Exit mobile version