RPF: ఆర్‌పిఎఫ్ లో 19,800 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ అనేది ఫేక్.. దక్షిణ మధ్యరైల్వే

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ( ఆర్‌పిఎఫ్ ) లో 19,800 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు వెలువడిన వార్తలను దక్షిణ మధ్య రైల్వే ఖండిచింది.

  • Written By:
  • Updated On - January 12, 2023 / 05:40 PM IST

RPF: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) లో 19,800 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు వెలువడిన వార్తలను దక్షిణ మధ్య రైల్వే ఖండిచింది. దక్షిణ మధ్యరైల్వే సోషల్ మీడియాలో ఈ నకిలీ నోటిఫికేషన్ చెలామణి అవుతున్న నేపధ్యంలో దీనిపై ప్రకటన విడుదల చేసింది.

ఆర్‌పిఎఫ్ గురించి వచ్చినందంతా ఫేక్ న్యూస్

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్)లో 19,800 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి సోషల్ మీడియా మరియు వార్తాపత్రికలలో కల్పిత సందేశం ప్రసారం చేయబడింది. ఆర్‌పిఎఫ్(RPF) లేదా రైల్వే మంత్రిత్వ శాఖ వారి అధికారిక వెబ్‌సైట్‌లలో లేదా ఏదైనా ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అటువంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని దీనిద్వారాతెలియజేయబడిందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది, ఉద్యోగాలను ఆశించేవారు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) వెబ్‌సైట్‌ను మాత్రమే సందర్శించాలని అధికారులు కోరారు.

ప్రస్తుత కాలంలో ఇలాంటి ఫేక్ న్యూస్ లు ఎక్కువై పోయాయి. అందులోనూ ముఖ్యంగా వర్క్ ఫ్రం హోమ్ ట్రెండ్ వచ్చినదగ్గర నుంచి సైబర్ క్రైం నేరాలు అడ్డూ ఆపూ లేకుండా పెరిగిపోయాయి. ఫోన్లకు ఫేక్ మెస్సేలు పెట్టి వాటిని క్లిక్ చేసిన వెంటనే అమాయకుల ఖాతాల్లో నుంచి డబ్బు వాటంతటవే బదిలీ అవ్వడం వంటివి వెలుగుచూస్తున్నాయి. మరి వీటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సి అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వాలు ఎంతలా అవగాహణ కల్పించినా వ్యక్తిగత అవగాహన కూడా ఎంతో అవసరం.

 

ఇవి కూడా చదవండి..

Varahi: వారాహిని అడ్డుకునేందుకే జీవో నెంబర్ 1

Janasena Yuvashakthi: తమనీడను తామే చూసి భయపడే స్వభావం జగన్ ది- నాగబాబు

Janasena Yuvashakthi: జ్ఞాని ఎవరంటే.. భగవద్గీత శ్లోకం చదివి అందరి చేతా వావ్ అనిపించిన ముస్లిం యువతి

Nagababu : బాబాయ్ హత్య ఆయనకు తప్పుకాదు.. అడ్డం వచ్చినవారిని అడ్డుతొలగించడమే ఆయన పని : నాగబాబు

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/