Gujarat: గుజరాత్‌లోని మెహసానా జిల్లాకు చెందిన ఒక మాజీ సర్పంచ్ వివాహ కార్యక్రమంలో తన ఇంటి పైనుండి నోట్ల వర్షం కురిపించి గ్రామస్తులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. కడి తహసీల్‌లోని అగోల్ గ్రామం మాజీ సర్పంచ్ కరీం యాదవ్ సోదరుడి కుమారుడు రజాక్ పెళ్లి వేడుకలో భాగంగా డబ్బుల వర్షం కురిసింది.కరీం జాదవ్ మరియు రసూల్ భాయ్ ఇద్దరు సోదరులు. రసూల్ కుమారుడు రజాక్ ఒక్కడే వీరి కుటుంబానికి వారసుడు. దీనితో అతని పెళ్లి సందర్బంగా ఇంటిపైనుంచి రూ.500 నోట్లను వెదజల్లారు.
ఇంటిపైనుంచి రూ.500 నోట్లు వెదజల్లారు.. (Gujarat)
రజాక్ పెళ్లి ఊరేగింపు గ్రామం గుండా వెళుతున్నప్పుడు, మాజీ సర్పంచ్ మరియు అతని కుటుంబ సభ్యులు అతని ఇంటిపై నుండి వేడుకలను చూసేందుకు గుమిగూడిన ప్రజలపై రూ. 500 నోట్లను వెదజల్లారు. ఈ వీడియో వైరల్ గా మారింది. తరువాత వీరి కుటుంబసభ్యలు , బంధువులు కూడా గ్రామ కూడలి మధ్యలో ఉన్న ఇళ్ల పైకప్పులపైకి ఎక్కి నోట్ల వర్షం కురిపించారు. మొత్తంమీద పెళ్లి సందర్బంగా గ్రామంలో లక్షల రూపాయల కరెన్సీ నోట్ల వర్షం కురిసింది. ఈ నోట్లను తీసుకునేందుకు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు గుమికూడారు.
దొంగిలించిన సొమ్మును తిరిగి ఇవ్వడం లాంటిది..(Gujarat)
ఈ వీడియో చూసి నెటిజన్లు అవాక్కయ్యారు మరియు చాలా మంది “అందుకే భారతదేశం పేద దేశం” అని ఎత్తి చూపారు.
మరికొందరు ఇలా వ్రాశారు: “నిజ జీవితంలో ఫర్జీ సిరీస్” “ఎటువంటి హడావిడి లేకుండా ప్రజలు ఇంత ప్రశాంతంగా ఎందుకు సేకరిస్తున్నారని నేను ఆశ్చర్యపోతున్నాను … అందుకే గుజరాతీ గుజరాతీ అని నిరూపించండి ఛాయా దాష్ కా నామ్ అలాగ్ హో”
“మొదట దొంగిలించిన సొమ్ము వ్యక్తులకు తిరిగి ఇవ్వడం” అని నెటిజన్లు కూడా ఎత్తి చూపారు. కొంతమంది “ఐసే హీ గ్రీబీ ఆ జాయేగీ ఫిర్ ఇంకే పుస్తే బాటిఎన్ క్రేంగి హ్మరే పాపా కి షాదీ మే నోటో కి బారిష్ హుయీ థీ హమ్ కిత్నే అమీర్ ది నా ” అని కూడా అభిప్రాయపడ్డారు.
కొద్దినెలల కిందట బెంగళూరులోని ఒక కూడలిలో భవనంపైనుంచి ఒక వ్యక్తి కిందకు కరెన్సీ నోట్లను వెదజల్లాడు. దీనిని తీసుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీనితో పోలీసులు రంగంలోకి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
Former sarpanch showers cash at wedding event in Gujarat’s Mehsana.
A former sarpanch of a village in Gujarat’s Mehsana showered money on people gathered to witness his nephew’s wedding celebrations.
pic.twitter.com/BjkeZgKW67— Ahmed Khabeer احمد خبیر (@AhmedKhabeer_) February 19, 2023