Site icon Prime9

Heeraben Modi : ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మోదీకి ప్రముఖుల నివాళి…

prominent persons condolence to pm modi mother heeraben death

prominent persons condolence to pm modi mother heeraben death

Heeraben Modi : ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ మోద కన్నుమూశారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురి కావడంతో అహ్మదాబాద్‌లోని మెహతా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియాలజీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందతున్న హీరాబెన్‌ ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఇటీవలే జూన్ 18 వ తేదీన ఆమె వందో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. కొద్దిరోజుల క్రితం ఆరోగ్యం క్షీణించడంతో అహ్మదాబాద్‌లోని మెహతా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియాలజీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందతున్న హీరాబెన్‌ ఆరోగ్యం విషమించడంతో ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటలకు కన్నుమూశారు.

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్‌ అంత్యక్రియలు ముగిశాయి. అంతకుముందు అంతిమయాత్రలో పాల్గొన్న ప్రధాని మోదీ తల్లి పాడె మోశారు. కడసారి హీరాబెన్‌ను చూసి స్థానికులు, బీజేపీ నేతలు నివాళులర్పించారు. హీరాబెన్ మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రముఖులు ఆమె పార్థివదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. అదే విధంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా హీరాబెన్ కు నివాళులు అర్పిస్తున్నారు.

Exit mobile version