Site icon Prime9

PM Modi: హిమాచల్ ప్రదేశ్లో ప్రధాని మోదీ పర్యటన

pm-modi himachal pradesh tour

pm-modi himachal pradesh tour

PM Modi: హిమాచల్ ప్రదేశ్‌లో నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలను చేయనున్నారు. ఉనా, హిమాచల్ రైల్వే స్టేషన్ నుండి జెండా ఊపి వందే భారత్ రైలును మోదీ ప్రారంభించనున్నారు. అంబ్ అందౌరా నుంచి న్యూఢిల్లీ వరకు ఈ కొత్త ఎక్స్‌ప్రెస్ పరుగులు తీయనుంది. దేశంలో ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లలో ఇది నాలుగవది.

ఉనాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. అదేవిధంగా ఉనాలో బల్క్ డ్రగ్ పార్క్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం చంబాలో జరిగే బహిరంగ కార్యక్రమంలో రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. తదుపరి ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (PMGSY)-IIIని మోదీ ప్రారంభిస్తారు. ఉదయం 11:45 గంటలకు చంబాలోని సుల్తాన్‌పూర్ హెలిప్యాడ్‌ నుంచి చౌగన్‌ మైదాన్‌కు చేరుకుని అక్కడ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. మరియు ఆ ప్రాంతంలో జరిగే బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. తదుపరి మధ్యాహ్నం 1:05 గంట తరువాత పఠాన్‌కోట్ మీదుగా మోదీ ఢిల్లీకి చేరుకుంటారు.

ఇదీ చదవండి: దీపావళికి 10 రోజుల సెలవులు..!

Exit mobile version