Site icon Prime9

Arvind Kejriwal: 10 రోజుల్లో రూ.163 కోట్లు చెల్లించాలని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ కు నోటీసులు.. ఎందుకో తెలుసా?

KEJRIWAL

KEJRIWAL

Arvind Kejriwal: ప్రభుత్వ ప్రకటనల రూపంలో రాజకీయ ప్రకటనల కోసం రూ.163.62 కోట్లు ఖర్చుపెట్టినందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి గురువారం నోటీసులు అందాయి. ఈమొత్తాన్ని 10 రోజుల్లోగా చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రభుత్వ ప్రకటనల ముసుగులో ప్రచురించిన రాజకీయ ప్రకటనల కోసం ఆప్ నుండి 97 కోట్ల రూపాయలు రికవరీ చేయాలని ప్రధాన కార్యదర్శిని ఆదేశించిన ఒక నెల తర్వాత ఈ పరిణామం జరిగింది. డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ (డిఐపి) జారీ చేసిన నోటీసులో వడ్డీకూడా చెల్లించాలని కోరారు.

ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)కు ఈ నోటీసు అందింది.

మార్చి 31, 2017 వరకు రాజకీయ ప్రకటనలపై పెట్టిన అసలు మొత్తంలో రూ.99,31,10,053 (రూ. 99.31 కోట్లు) ఉండగా, మిగిలిన రూ. 64,30,78,212 (రూ. 64.31 కోట్లు)అపరాధ వడ్డీ ఖాతాలో ఉంది.

ఢిల్లీ ప్రభుత్వ డైరెక్టరేట్ ఆఫ్ ఆడిట్ కూడా మార్చి 31, 2017 తర్వాత అటువంటి అన్ని రాజకీయ ప్రకటనల ఆడిట్‌ను నిర్వహించడానికి ప్రత్యేక ఆడిట్ బృందాన్ని నియమించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

2016లో, ఆప్ ప్రభుత్వం రాజకీయ ప్రకటనలకు సంబంధించిన ఫిర్యాదుల విషయంలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ ప్రకటనలలో కంటెంట్ నియంత్రణ కమిటీ (CCRGA)ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ముగ్గురు సభ్యుల CCRGA, సెప్టెంబర్ 2016లో, “అత్యున్నత న్యాయస్థానం రూపొందించిన మార్గదర్శకాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం మరియు లక్ష్యాలు రాజకీయ నాయకుడు లేదా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ యొక్క ఇమేజ్ కోసం ప్రభుత్వ నిధుల దుర్వినియోగాన్ని నిరోధించడం” అని ఆదేశించింది.

 

కొత్త ప్రేమలేఖ..

ఆప్ ముఖ్య అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ దీనిని “కొత్త ప్రేమలేఖ”గా అభివర్ణించారు. “మేము జాతీయ పార్టీగా మారామని, ఢిల్లీ కార్పోరేషన్ లో అధికారం చేజిక్కించుకున్నామని బీజేపీ కంగారుపడింది. లెఫ్టినెంట్ గవర్నర్ సాహబ్ బీజేపీ ఆదేశాలకు అనుగుణంగా ప్రతిదీ చేస్తున్నారు. ఇది ఢిల్లీ ప్రజలను కలవరపెడుతోంది. ఎల్‌జీ ఆదేశాలు చట్టం దృష్టిలో నిలబడవని ఆయన అన్నారు.

మరోవైపు బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావల్లా ఆప్ బాధితుల్లా మాట్లాడకుండా మొత్తాన్ని చెల్లించాలని అన్నారు పది రోజుల్లో రూ.163 కోట్లు చెల్లించాలని ఆప్ ప్రభుత్వానికి జారీ చేసిన నోటీసును స్వాగతించాలి. AAP = ఔర్ అడ్వర్టైజ్‌మెంట్-వాలి పార్టీ. ఢిల్లీ హైకోర్టు ఆర్డర్‌ను ఉల్లంఘించి ఆప్ రాజకీయ ప్రకటనల కోసం ప్రజల డబ్బును దర్వినియోగం చేసిందని ఆయన ఆరోపించారు.

 

ఇవి కూడా చదవండి..

Varahi: వారాహిని అడ్డుకునేందుకే జీవో నెంబర్ 1

Janasena Yuvashakthi: తమనీడను తామే చూసి భయపడే స్వభావం జగన్ ది- నాగబాబు

Janasena Yuvashakthi: జ్ఞాని ఎవరంటే.. భగవద్గీత శ్లోకం చదివి అందరి చేతా వావ్ అనిపించిన ముస్లిం యువతి

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version