Site icon Prime9

New trains from Telangana: తెలంగాణ నుండి యుపి, ఆంధ్రాకు నాలుగు రైళ్లు

indian-railways-cancelled-155-trains-across-india-today

indian-railways-cancelled-155-trains-across-india-today

Secunderabad: తెలంగాణ ప్రజలకు దక్షిణ మద్య రైల్వే శుభవార్త చెప్పింది. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఆంధ్రా, మధ్య ప్రదేశ్ ప్రాంతాలను కలుపుతూ 4 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది.

సికింద్రాబాద్ – సుబేదార్‌గంజ్‌, నాందేడ్ – తిరుపతి మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్‌ అధికారులు మంగ‌ళ‌వారం వెల్లడించారు. ఈ నెల 24 నుంచి రైళ్లు అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే సికింద్రాబాద్ – తిరుపతి రైల్వే స్టేషన్ల మధ్య అదనంగా రెండు ప్రత్యేక రైళ్ల‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్ర‌క‌టించారు. ప్ర‌యాణికులు అద‌న‌పు రైళ్ల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. దసరా నేపధ్యంలో కొత్త రైళ్లు రాకపోకలు ప్రజలకు ఉపయోగంగా ఉండనున్నాయి.

Exit mobile version