Site icon Prime9

Mukesh Ambani: అంబానీకి కలిసొచ్చిన హిండెన్ బర్గ్ నివేదిక.. మళ్లీ అపర కుబేరుడిగా ముఖేష్

Ambani

Ambani

Mukesh Ambani: దేశంలోనే అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మళ్లీ అవతరించారు.

స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూపు కంపెనీల షేర్ల పతనంతో గౌతమ్ అదానీ ఆస్తి విలువ రోజురోజుకూ కరిగిపోతోంది.

దీంతో అదానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడి హోదాను కోల్పోయారు.

ఈ నేపధ్యంలో అదానీ ని వెనక్కి నెట్టి ముఖేష్ అంబానీ అసియాలోనే ప్రపంచ కుబేరుడిగా ఎదిగారు.

 

బిగ్గెస్ట్ గెయినర్ నుంచి బిగ్గెస్ట్ లూసర్ గా

తాజా నివేదిక ప్రకారం అదానీ సంపద 75.1 బిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో ఆయన  15 వ స్థానంలో నిలిచారు.  83.7 బిలియన్ డాలర్ల సంపదతో ముఖేష్ అంబానీ 9 వ స్థానంలో ఉన్నారు.

జనవరి 17, హిండెన్ బర్గ్ నివేదిక విడుదలకు ఒకరోజు ముందు అదానీ (Gautam Adani) ఆదాయం 124 బిలియన్ డాలర్లు. దీంతో అపుడు అదానీ మూడవ ప్లేసులో ఉన్నారు.

హిండెన్ బర్గ్ నివేదిక వచ్చిన తర్వాత అదానీ షేర్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన సంపద దాదాపు 52 బిలియన్ డాలర్లు తగ్గింది.

2022లో అత్యధిక సంపదను అర్జించి ప్రపంచ సంపన్నుల జాబితాలో ఆధిపత్యం కొసాగించి.. ఈ ఏడాది అదే జాబితాలో బిగ్గెస్ట్ లూసర్ గా నిలిచారు.

 

అదానీ గ్రూప్ స్టాక్ లో అవకతవకలు, అకౌంటింగ్ మోసం చేశారని హిండెన్ బర్గ్  నివేదిక ఆరోపించింది. అదానీ సోదరుడిపై కూడా ఆరోపణలు చేసింది.

గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ డొల్ల కంపెనీలను నిర్వహిస్తున్నారని హిండెన్ బర్గ్ తన నివేదికలో పేర్కొంది.

ఆఫ్ షోర్ ట్యాక్సుల స్వర్గధామాలైన కరేబియన్, మారిషస్ లను అదానీ అనుచితంగా వాడుకుంటోందని ఆరోపించింది.

 

తగ్గిన అంబానీ నికర విలువ (Mukesh Ambani)

ఇదిలా ఉండగా, మరోసారి ఆసియా అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ నికర విలువ కూడా ఈ ఏడాది పడిపోయింది.

బ్లూమ్ బర్గ్ ప్రకారం, ఈ ఏడాది ఇప్పటి వరకు అంబానీ సంపద 6.08 బిలియన్ డాలర్లు తగ్గింది.

ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ దిగ్గజం ఎల్ఎంవీహెచ్ కు చెందిన బెర్నార్డ్ అర్నాల్ట్ 191 బిలియన్ డాలర్ల సంపదతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.

ఆ తర్వాతి స్థానంలో ట్విటర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొనసాగుతున్నారు. మూడో స్థానంలో అమెజాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జెఫ్‌ బెజోస్‌ నిలిచారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version