Site icon Prime9

Fire accident: పుణె రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం

Massive fire in Pune restaurant

Pune: మహారాష్ట్ర పుణెలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లుల్లా నగర్ చౌక్‌లోని 7 అంతస్తుల మార్వెల్ విస్టా భవంతిలోని పై అంతస్తులో ఘటన చోటుచేసుకొనింది. ఉదయం 8.15 గంటల వెజిటా రెస్టారెంట్లో ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగసి పడ్డాయి.

సమాచారం అందుకొన్న ఐదు అగ్నిమాపక శకటాలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. ఒకటిన్నర గంటల అనంతరం మంటలు అదుపులోకి వచ్చాయి. భారీ మంటలకు హోటల్ పై భాగం పూర్తి దెబ్బతినింది. ప్రమాదానికి కారణాలు కానీ, ఏ మేరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చనేది కానీ తెలియలేదు. ఈ ప్రమాదంలో ఎవరైనా మరణించారా అనేది కూడా అధికారులు ఇంకా నిర్ధారించలేదు.

మంటలను అదుపులోకి తెచ్చిన అనంతరం అగ్నిప్రమాదం జరగకుండా నీటిని చల్లి కూలింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంటలు చెలరేగడంతో రెస్టారెంట్‌కు భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. ఈ భవంతి గ్రౌండ్ ఫ్లోర్‌లో క్రికెటర్ జహీర్ ఖాన్ రెస్టారెంట్ కూడా ఉంది.

ఇది కూడా చదవండి: Actress Rambha: హీరోయిన్ రంభకు గాయాలు.. కారుకు యాక్సిడెంట్‌

Exit mobile version