Site icon Prime9

Wedding Invitation to Army: “ప్రియమైన హీరోస్..” మా పెళ్లికి రండి.. భారత సైన్యానికి కేరళ జంట ఆహ్వానం

kerala-couple-invites-indian-army-to-their-wedding

kerala-couple-invites-indian-army-to-their-wedding

Wedding Invitation to Army: సమీప బంధువులు లేదా తెలిసినవాళ్లకు పెండ్లికి పిలవడం చూస్తుంటాం. కానీ ఆ యువ జంట మాత్రం తమ దేశాన్ని తమను ఎంతో సుఖసంతోషాలతో ఉండేలా చూస్తూ దేశ సరిహద్దుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న సైనికులకు పెండ్లి పత్రిక పంపి వివాహానికి ఆహ్వానించారు. పెండ్రి పత్రికలో ‘మీ ధైర్యసాహసాల వల్లే మేమిక్కడ సంతోషంగా జీవిస్తున్నాం, ఇప్పుడు ఒక్కటవబోతున్నాం, ఇలాంటి ఆనంద సమయంలో మీరు మా చెంత ఉండాలి’ అంటూ కేరళకు చెందిన ఓ యువజంట భారత సైన్యానికి పెండ్లి పత్రిక పంపించింది. ఆ కార్డు అందుకున్న ఆర్మీ అధికారులు కూడా అంతే సంతోషంగా జవాబిచ్చారు. కలకాలం కలిసి ఉండాలంటూ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లికి పిలిచినందుకు ధన్యవాదాలు చెబుతూ సదరు పెండ్లి పత్రికను ఆర్మీ అధికారులు ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది.

కేరళకు చెందిన రాహుల్, కార్తీకలు ఈ నెల 10న వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి ఆ జంట ఆర్మీని ఆహ్వానించింది. తమ పెండ్లి పత్రికను ఆర్మీకి పంపించింది. ‘ప్రియమైన హీరోలకు..’ అంటూ సైనికులను సంబోధిస్తూ.. మీ ప్రేమ, దేశంపై మీకున్న భక్తి, విధినిర్వహణలో మీరు చూపించే సాహసానికి మేమెంతో రుణపడి పోయామని పేర్కొన్నారు. ‘సరిహద్దుల్లో కాపలా కాస్తూ మమ్మల్ని జాగ్రత్తగా కాపాడుతున్నందుకు, మా జీవితాలను సంతోషంగా ఉంచుతున్నందుకు మీకు ధన్యవాదాలు. మా పెళ్లికి హాజరై మమ్మల్ని దీవించండి’ అంటూ ఆ యువ జంట ఆహ్వానించారు.

ఇదీ చదవండి: ప్రేమంటే ఇదేరా.. ప్రియురాలి మృతదేహానికి తాళికట్టాడు

Exit mobile version
Skip to toolbar