Site icon Prime9

Nitin Gadkari: కాంగ్రెస్‌లో చేరడం కంటే బావిలో దూకడం బెటర్ .. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

Nitin Gadkari

Nitin Gadkari

Nitin Gadkari: కాంగ్రెస్‌లో చేరడం కంటే బావిలో మునిగిపోవడమే మేలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.

కాంగ్రెస్‌లో చేరమని నా స్నేహితుడు ఒకసారి నాకు సలహా ఇచ్చాడు, నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం కంటే బావిలో మునిగిపోతానని చెప్పాను. కాంగ్రెస్ సిద్ధాంతాలు నాకు నచ్చవు అని ఆయన అన్నారు.కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేసిన ఒక రోజు తర్వాత గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

మరోవైపు సీనియర్లతో ఎలా ప్రవర్తించాలో రాహుల్ గాంధీకి తెలియదంటూ తెలంగాణ కాంగ్రెస్ నేత, రాజ్యసభ మాజీ ఎంపీ ఎంఏ ఖాన్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Exit mobile version