Site icon Prime9

IndiaGate: ఈ నెల 8న ఇండియాగేట్ పూర్తిగా మూసివేస్తారు..ఎందుకో తెలుసా?

Indiagate will be completely closed on 8th of this month

IndiaGate: ఢిల్లీలో ఈ నెల 8న జరగబోయే సెంట్రల్ విస్టా (కొత్త పార్లమెంట్ భవనసముదాయం ప్రారంభోత్సవం సందర్బంగా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.కొన్ని రహదారులపై గురువారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సాధారణ ట్రాఫిక్ మళ్లించబడుతుందని ప్రకటించారు.

ప్రధాని నరేంద్ర మోదీ భద్రత దృష్ట్యా సెప్టెంబర్ 8న ఇండియా గేట్ సర్కిల్ (సి-హెక్సాగాన్) పూర్తిగా మూసివేయబడుతుంది. ఇండియా గేట్‌లోని మొత్తం పది మార్గాలు మరియు రాజ్‌పథ్ సమీపంలోని మార్గాలు పూర్తిగా మూసివేయబడతాయి. సెప్టెంబరు 8న న్యూఢిల్లీ ప్రాంతంలోకి బస్సులను అనుమతించరు. న్యూఢిల్లీని గంటలపాటు నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించడంతో పాటు భద్రత కోసం రాష్ట్రపతి భవన్‌లో ఎంట్రీ డ్రోన్ క్షిపణులను మోహరించనున్నారు. ఈ నేపధ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుందని అంచనా వేసిన అధికారులు దానికి తగిన విధంగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

Exit mobile version