GetoutRavi: తమిళనాడు అసెంబ్లీలో అధికార డీఎంకే నేతృత్వంలోని ప్రభుత్వానికి, గవర్నర్ ఆర్‌ఎన్ రవికి మధ్య వాగ్వాదం తరువాత చెన్నైలో డీఎంకే నేతలు పోస్టర్ వార్ కు దిగారు. డీఎంకే వెస్ట్ చెన్నై సెక్రటరీ మంగళవారం చెన్నై వీధుల్లో GetoutRavi అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్ నంబర్ 1 ట్రెండింగ్‌తో పోస్టర్‌లు వేశారు. ఆ హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు.
సోమవారం రాష్ట్ర అసెంబ్లీ ప్రసంగంలో, దివంగత ఇవి రామసామి ‘పెరియార్’ మరియు సీఎన్ అన్నాదురై సహా ద్రవిడ ప్రముఖుల పేర్లను గవర్నర్ రవి దాటవేశారు. దీనితో ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగాన్నే గవర్నర్ చదవాలంటూ ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తీర్మానం చేసారు. వెంటనే గవర్నర్ రవి అసెంబ్లీనుంచి వాకౌట్ చేసారు. గత కొద్దిరోజులుగా గవర్నర్ అభివృద్ధి కార్యక్రమాలపై శ్రద్ధ చూపకుండా రాష్ట్ర రాజకీయాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. గవర్నర్ వాకౌట్ పై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పందించారు, ఈరోజు ఒక సంఘటన జరిగింది మీరందరూ తప్పక విని ఉంటారు. చరిత్రలో ఇంతకు ముందు జరగని పనిని మా నాయకుడు చేసాడు, సాధారణంగా, మా నాయకుడు తన ప్రతిస్పందన మరియు ప్రకటనలలో ప్రతిపక్షాన్ని పరుగెత్తిస్తాడు. కానీ ఈ రోజు అతను గవర్నర్‌ను పరుగెత్తించాడని అన్నారు.
ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే ఈ ఘటన తమను తీవ్రంగా నిరాశపరిచిందదని తెలిపింది. సీఎం స్టాలిన్ గవర్నర్ పట్ల అమర్యాదగా ప్రవర్తించారని ఆరోపించారు. ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి కోవై సత్యన్ గెట్‌అవుట్‌రవి(GetoutRavi) పోస్టర్‌లు డీఎంకే అసమర్థతను దాచడానికేనంటూ విమర్శించారు. బీజేపీ నాయకుడు నారాయణన్ మాట్లాడుతూ ఇది డీఎంకె ప్రభుత్వం చేస్తున్న నీచమైన మరియు చౌకబారు రాజకీయం, గత 60 సంవత్సరాలుగా డీఎంకె తమిళనాడు ప్రజలను దుర్భాషలాడుతోంది.భారత రాజ్యాంగాన్ని అవమానిస్తోంది. సీఎం స్టాలిన్ అతి పెద్ద తప్పు చేశారు. డీఎంకే ఇలాంటి చర్యలు మానుకోవాలని అన్నారు.
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/