kullu water falls: కొద్ది రోజులుగా దేశంలో చలి తీవ్రగా అధికంగా పెరిగింది. చలి తీవ్రతకు దేశ ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కురవడం.. రోడ్డు, రైలు, విమాన ప్రయాణాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఉత్తర భారతదేశ విషయానికి వస్తే అంతే సంగతి.. అక్కడి చలి ఎలా ఉంటుందో మనం పెద్దగా చెప్పనక్కర్లేదు. దేశంలో పెరిగిన విపరీతమైన చలికి అక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
హిమాచల్ అందాలను చూశారా?
ఇక కశ్మీర్ నుంచి కన్యకుమారి వరకు చలిగాలులు ప్రజలను వణికించేస్తున్నాయి. అత్యంత శీతల ప్రాంతంగా పిలవబడే ఉత్తర భారతంలో ఎన్నడు లేనంతగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దానికి తోడుభారీగా మంచు పేరుకుపోతుంది. దీంతో అక్కడి నీటి సెలయేళ్లు సైతం గడ్డకట్టే పరిస్థితులు వచ్చాయి. ఇదిలా ఉండగా హిమాచల్ ప్రదేశ్ లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. అక్కడి వాతావరణానికి ఉష్ణోగ్రతలు మైనస్ కి చేరుతున్నాయి. దీంతో కులూలోని ఓ జలపాతం కూడా చలికి గడ్డకట్టిపోయింది.
On #Udaipur – #Tindi road… Near Bhim bagh 🥶
7th January 2023#Lahaul , #HimachalPradesh@SkymetWeather @jnmet @Mpalawat @JATINSKYMET pic.twitter.com/IqLve8xh1I
— Gaurav kochar (@gaurav_kochar) January 7, 2023
పర్యాటకుల సెల్ఫీలు
ఈ గడ్డకట్టిన కులూ జలపాతం వీడియోలు నెట్టింటా వైరల్ గా మారాయి. శీతల పరిస్థితుల వల్ల పై నుంచి పడే నీరు కూడా మంచు రూపంలో గడ్డకట్టుకుపోయింది. దీంతో అక్కడి అందాలను స్థానికులు, పర్యాటకులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు.
మంచు అందాలతో కనువిందు చేస్తున్న ఈ జలపాతాన్ని చూసేందుకు పర్యటకులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రస్తుతం అక్కడికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని ప్రాంతాలు మాత్రం మంచుతో చెక్కిన శిల్పంలా పర్యటకులకు కనువిందు చేస్తున్నాయి. ఇక్కడకి వచ్చిన పర్యటకులు సెల్ఫీలతో మంచును ఎంజాయ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
CCTV: హైదరాబాద్‌లో పిల్లిని ఎత్తుకుపోతున్న దొంగ.. CCTV ఫుటేజ్ వైరల్
Khammam Politics: ఖమ్మంలో ఊహించని ట్విస్ట్‌లు.. ఫిక్స్ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. పోతే పోనియండన్న కేసీఆర్
Constable Leave Letter: సార్ నా భార్య అలిగింది.. బుజ్జగించడానికి లీవ్ ఇవ్వండి
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/