Site icon Prime9

Delhi: భగీరథ్ ప్యాలెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. 400 కోట్లకుపైగా ఆస్తి నష్టం..!

fire accident-at-delhis-bhagirath-palace

fire accident-at-delhis-bhagirath-palace

Delhi: ఢిల్లీలోని చాందినీ చౌక్‌ ప్రాంతంలోని భగీరథ్ ప్యాలెస్ మార్కెట్‌లోని దుకాణాలలో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. భగీరథ్ ప్యాలెస్‌లో అగ్నిమాపక సిబ్బంది వరుసగా మూడో రోజు శనివారం కూడా మంటలను ఆర్పేందుకు శ్రమిస్తుండగా భారీ అగ్నిప్రమాదంలో దాదాపు 200
దుకాణాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న 14 అగ్నిమాపక యంత్రాలు అహర్నిశలు శ్రమించి ఎట్టకేలకు  మంటలను అదుపులోకి తెచ్చారు.

హోల్‌సేల్ మార్కెట్‌లోని దాదాపు 200 షాపుల్లో చాలా వరకు అగ్నిప్రమాదంలో ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు సంబంధించినవని ఉన్నాయని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. నిర్లక్ష్యంగా వాటిని విక్రయించడం లేదా సరైన అనుమతులు తీసుకోకుండా దుకాణాలు కట్టడం వంటి చర్యల వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని ఆయన తెలిపారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా శనివారం భగీరథ్ ప్యాలెస్ మార్కెట్‌ను సందర్శించారు. వేలాడే విద్యుత్‌ తీగలు, ఓవర్‌లోడ్ సర్క్యూట్‌లు, పాత భవనాలు, నీటి కొరత, ఇరుకైన లేన్‌లతో, అటువంటి ప్రాంతాలు మంటలకు ప్రమాదకరంగా ఉంటాయని లెఫ్టినెంట్ గవర్నర్ ట్వీట్ చేశారు. 30 రోజుల్లోగా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని కోరినట్లు సక్సేనా తెలిపారు.
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణహాని జరుగులేదు కానీ 400 కోట్లకుపైగా ఆస్తి నష్టం సంభవించిందని వ్యాపారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: ముంబైలో మీజిల్స్ కలకలం.. దాదాపు 300 కేసులు

Exit mobile version