Site icon Prime9

Election Commission Of India : ఐదు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా.. ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్.. లైవ్

Election Commission Of India announcement for 5 states elections

Election Commission Of India announcement for 5 states elections

Election Commission Of India : ఢిల్లీలోని ఆల్ ఇండియా రేడియో రంగ్ భవన్ ఆడిటోరియంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను సీఈసీ రాజీవ్ కుమార్ విడుదల చేశారు. ఈ ఏడాది మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని ప్రకటించారు. ఈ మీడియా సమావేశంలో సమయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు ఎన్నికల కమిషన్‌లోని కీలక అధికారులు హాజరయ్యారు. 40 రోజుల పాటు 5 రాష్ట్రాల్లో పరిస్థితులను పరిశీలించి.. ప్రభుత్వ అధికారులతో చర్చించామన్నారు.

కాగా తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరాం, చతిస్గడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో తక్షణం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది తెలిపారు. మొత్తంగా ఐదు రాష్ట్రాల్లో 679 అసెంబ్లీ స్థానాలుండగా.. 16. 14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వీరిలో 60 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. ఈ రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగిందని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం పోలీస్ స్టేషన్లను, పోలింగ్ బూత్ లను.. బాత్రూంలు, నీటి సౌకర్యం లాంటి కనీస అవసరాలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఐదు రాష్ట్రాల్లో ఒకటి పాయింట్ 1. 77 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వృద్ధులకు ఇంట్లో నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నామని అన్నారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేయనున్నామని, సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ ఎన్నికల్లో వృద్ధులకు ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. రాజస్థాన్ లో నవంబర్ 23న.. మధ్యప్రదేశ్, మిజోరాంలో నవంబర్ 7న.. చత్తీస్ గఢ్ లో రెండు విడతల్లో నవంబర్ 7, 17 తేదీల్లో .. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా.. ఐదు రాష్ట్రాల్లో డిసెంబర్ 3న ఎన్నికల కౌంటింగ్ చేయనున్నారు.

 

Exit mobile version