Site icon Prime9

Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో కీలక మలుపు.. ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్

Delhi Liquor Scam

Delhi Liquor Scam

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. తాజాగా ఈ వ్యవహారంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది.

హైదరాబాద్ కు చెందిన ఛార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.

గోరెంట్ల బుచ్చిబాబు గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఛార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేశారు.

హైదరాబాద్ కు చెందిన పలు సంస్థలకు లాభం చేకూరేలా బుచ్చిబాబు వ్యవహరించారన్న ఆరోపణలతో ఆయనను అరెస్టు చేశారు సీబీఐ అధికారులు.

మంగళవారం రాత్రి హైదరాబాద్ లో ఆయన అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు.

కాగా, లిక్కర్ స్కాంలో 14 నిందితుడిగా ఉన్న రామచంద్ర పిళ్లై కి కూడా ఛార్టెడ్ అకౌంటెంట్ గా గోరంట్ల బుచ్చిబాబు పనిచేశారు.

 

కీ రోల్ గా బుచ్చిబాబు(Delhi Liquor Scam)

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించడం, అమలు చేయడం.. దాని ద్వారా హైదరాబాద్ కు చెందిన వివిధ కంపెనీలకు లాభం చేకూర్చడంలో

బుచ్చిబాబు కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

ఇక సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి చేతులు మారడంలో బుచ్చిబాబు కీ రోల్ పోషించినట్టు సమాచారం.

సౌత్ గ్రూప్ లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఎంపీ మాగుంట కుమారుడు రాఘవ్ , ఎమ్మెల్సీ కవిత, అరవిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి ఉన్నారు.

అయితే ఈ గ్రూప్ కు అభిషేక్ బోయిన పల్లి, అరుణ్ పిళ్లై, బుచ్చిబాబు లీడ్ చేసినట్టు వార్తలు వచ్చాయి.

ఇప్పటికే ఈ కేసులో అరబిందో శరత్ చంద్రా రెడ్డితో పాటు రామచంద్ర పిళ్లై, సమీర్ మహింద్రు వంటి వారిని సీబీఐ అరెస్ట్ చేసి విచారిస్తోంది.

గత ఏడాది ఆగష్టు చివర్లో ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం వెలుగు చూసింది. ఈ తర్వాత ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది.

ఢిల్లీ లిక్కర్‌ పాలసీలో పలువురిని ప్రశ్నించింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ కుమార్తె పేరు కూడా తెరపైకి వచ్చింది.

అది విచారణలో ఉండగా కవితకు వ్యక్తిగత ఆడిటర్‌గా పనిచేస్తున్న గోరంట్ల బుచ్చిబాబు పేరు కూడా బయటకు వచ్చింది.

 

కీలక హార్డ్‌ డిస్క్‌లు స్వాధీనం (Delhi Liquor Scam)

లిక్కర్ పాలసీ కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లో పలుమార్లు సోదాలు నిర్వహించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐలు గోరంట్ల బుచ్చిబాబును కూడా ప్రశ్నించారు.

హైదరాబాద్‌లో ప్రముఖులకు ఛార్టెడ్ అకౌంటెంట్‌గా సేవలు అందిస్తున్న బుచ్చిబాబును ప్రశ్నించిన సమయంలోనే అతని నివాసం నుంచి హార్డ్‌ డిస్క్‌లతో పాటు కీలక సమాచారాన్ని సేకరించారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో గత వారంలో సీబీఐ దాఖలు చేసిన అభియోగాల్లో ఎమ్మెల్సీ కవితతో పాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా ఉంది.

ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ పేరిట చక్రం తిప్పడంలో పలువురు ప్రముఖులు కీలక పాత్ర పోషించారని,

వ్యాపార ప్రయోజనాలు పొందడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ ఆరోపిస్తోంది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version